15 మంది ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్
ముజమ్మిల్ ఖాన్
పయనించే సూర్యుడు. మార్చి 01. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం : గత 25 నుంచి 30 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తూ ప్రజలకు నిర్విరామంగా అందించిన సేవలకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శుక్రవారం పదవి విరమణ పొందుతున్న 15 మంది అధికారులు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఎస్. దశరథం, ఏన్కూర్ పీహెచ్సీలో సిహెచ్ఓ గా పని చేస్తున్న డి. శివరాజు, కల్లూరు ఆరోగ్య కేంద్రంలో పిహెచ్ఎన్ (ఎన్.టి)గా పని చేస్తున్న ఎం. స్వర్ణలత, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఉసిరికాయలపల్లిలో ఎస్.జి.టి. గా పని చేస్తున్న బి. జగన్ నాయక్, తిరుమలాయపాలెం లో కామాటి గా పనిచేస్తున్న బి. బాల్య, పశు సంవర్ధక శాఖ, సదాశివునిపేటలో వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారిగా పనిచేస్తున్న టి. వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ విభాగంలో తల్లాడ ఎంపీడీవోగా పని చేస్తున్న ఎం. చంద్రమౌళి, జెడ్పీహెచ్.ఎస్, కొణిజెర్లలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సిహెచ్. మంగమ్మ, రెవెన్యూ శాఖ బోనకల్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న టి. పుల్లయ్య, కార్యాలయ సబార్డినేట్ గా పనిచేస్తున్న ఎం. ఆంటోని, పౌర సరఫరాల శాఖలో డిప్యూటీ తహసిల్దార్ గా పనిచేస్తున్న ఏ. తారామచంద్ర రావు, ఇంటర్మీడియట్ విద్యా శాఖలో నయాబజార్ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న కె. శ్రీరామారావు, జూనియర్ లెక్చరర్ బి. వెంకటేశ్వర్లు, ఎస్సీ సంక్షేమ శాఖలో హాస్టల్ వెల్ఫేర్ అధికారిగా పనిచేస్తున్న ఎం. ఝాన్సీ రాణి, కో ఆపరేటివ్ శాఖలో సీనియర్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న ఏ. శంకర్ ఫిబ్రవరి నెలలో పదవి విరమణ పొందారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో కార్యాలయ సబార్డినేట్లు విధి నిర్వహణలో తమకు చాలా మద్దతు అందిస్తారని అన్నారు. పదవి విరమణ తర్వాత కుటుంబంతో అధిక సమయం గడపాలని కలెక్టర్ సూచించారు. పదవి విరమణ పొందుతున్న ప్రతి ఉద్యోగి గత 25 నుంచి 30 సంవత్సరాలుగా ప్రభుత్వానికి వివిధ స్థాయిలలో సేవలు అందించారని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవలు అందించేందుకు గత 30 సంవత్సరాలుగా నిర్విరామంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలలో ప్రభుత్వ ఉద్యోగ విధులలో భాగంగా కుటుంబ సభ్యులకు చాలా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండదని, చాలాసార్లు పెళ్లి, పుట్టినరోజు వేడుకలను మిస్ అయి ఉంటారని తెలిపారు. పదవి విరమణ తర్వాత కుటుంబానికి అధిక సమయం కేటాయించాలని సూచించారు. వృద్ధాప్య మంటే మరో బాల్యం లాంటిదేనని, కొత్త విషయాలు నేర్చుకోవడం, క్రీడలు ఆడటం వంటి కార్యక్రమాలకు వీటిని వినియోగించుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వయస్సు రిత్యా నేడు పదవి విరమణ పొందుతున్నప్పటికీ తమ అనుభవాలను జూనియర్లతో పంచుకోవాలని కోరారు. గత 30 సంవత్సరాలుగా వివిధ ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో సేవలు అందించారని తెలిపారు. 60 సంవత్సరాల తర్వాత జీవితంలో మరో భాగం ప్రారంభమవుతుందని, దీనిని మీరంతా బాగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు పదవి విరమణ పొందిన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సిఇఓ దీక్షా రైనా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. కళావతి బాయి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.