
నూతన పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలియజేసిన
బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
( పయనించే సూర్యుడు డిసెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
నేడు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబెర్స్ ప్రమాణస్వీకారం సందర్బంగా ఫరూఖ్ నగర్ మండలం కడియాల కుంట తాండ గ్రామ సర్పంచ్ ముడావత్ రాజు నాయక్, ఉప సర్పంచ్ తావు సింగ్, వార్డు మెంబెర్స్ తావు సింగ్, ప్రియాంక దేవేందర్, దేవి రవి, నీలా భాస్కర్, చట్ పట్టా రవీందర్, గోపి, జ్యోతి రాజు ల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ…ప్రజలు ఇచ్చిన మంచి అవకాషాన్ని బాధ్యతాయుతంగా రాజకీయాలకు తావులేకుండా నిర్వర్తించాలని అన్నారు.ఎంపీ అరుణమ్మ కూడ ఎంపీ నిధుల నుండి నిధులు ఇస్తారన్నారు కాబట్టి నిధులు సద్వినియోగ పర్చుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు.
