
పయనించే సూర్యుడు అక్టోబర్ 10,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, అన్ని శాఖల అధికారులు కూడా తన ద్వారా వెళ్లే ప్రజల వినతులు పరిష్కారిస్తున్నారని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శుక్రవారం నంద్యాల పట్టణం బొమ్మలసత్రంలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల అర్జీలు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్వీకరించారు.నందికొట్కూరు, పగిడ్యాల, పాములపాడు, పాణ్యం, ఆళ్లగడ్డ, నంద్యాల, గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు తదితర మండలాల నుండి బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి వినతి పత్రాలు అందజేశారు. కొన్ని వినతి పత్రాలకు సంబందిత మండల స్థాయి అధికారులు ఎంపీ ఫోన్ ద్వారా పరిష్కారం చూపారు. రైల్వే, నేషనల్ హైవే వద్ద ఉన్న రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఎంపీ బైరెడ్డి శబరి ఫోన్ చేసి ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెట్టవద్దని సమస్య పరిష్కారం త్వరగా చూపాలని కోరారు. నంద్యాల పదవీ విరమణ ఉద్యోగులు తమకు కార్యాలయం నిర్మాణంకు సహకరించాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి వినతి పత్రం ఇవ్వగా ఎంపీ నిధులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. కొందరి సమస్యలపై ఎంపీ ఆయా పోలీసు స్టేషన్లకు ఫోన్ చేసి పరిష్కారం చూపాలని కోరారు. కొన్ని సమస్యలు దశల వారిగా పరిష్కారం చూపుతామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి, నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ డి. సుధాకర్ రెడ్డి, రైల్వే జోనల్ యూజర్స్ కన్సల్టేట్ కమిటీ మెంబర్ ఎ. వెంకటరంగయ్య, బి ఎస్ ఎన్ ఎల్ సలహా కమిటీ సభ్యులు పెరుమాళ్ళ విజయకుమార్, టీడీపీ నాయకులు కోడూరు సంజీవరెడ్డి, పోలూరు నాగేశ్వరరెడ్డి, సీమ కృష్ణ , గోరుకల్లు ఎరుకలయ్య, అయ్యాలూరు ప్రణవనాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.