
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ ఈ రోజు శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్నటి రోజు స్థానిక పార్లమెంట్ సభ్యుడు అరవింద్ మాట్లాడుతూ నిజం సర్కార్ పేరు వల్లనే నిజామాబాద్ అభివృద్ధి చెందడం లేదు అని, నిజం సాగర్లో నీళ్లు ఉండడం లేదు అని, నిజం షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందని చెప్పిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, గత పాలకులపై విమర్శలు చేయడం కంటే ప్రస్తుతం నిజామాబాద్ ను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై మాట్లాడితే ప్రజలు ఆదరిస్తారు అని రాంభూపాల్ అన్నారు. పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ఆయన లెటర్ ప్యాడ్ లో నిజామాబాద్ అని,విజిటింగ్ కార్డు నందు నిజామాబాద్ అని ముద్రించుకుంటూనే ఇప్పుడు నిజామాబాద్ మున్సిపల్ ఎలక్షన్లో వస్తున్నాయని నేపథ్యంలో నిజామాబాద్ పేరును ఇందూరు అని చెప్తూ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దీనిని ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు అని రాంభూపాల్ అన్నారు.బీజేపీ నాయకులకు కేవలం ఎన్నికలు ఉన్నప్పుడే నిజామాబాద్ పైన ప్రేమ పుట్టుకువస్తుందని ఎద్దేవ చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా ఏడు సంవత్సరాలుగా అరవింద్ పార్లమెంటును ఏ విధంగా కి వదిలేశాడో ,అభివృద్ధి పనులను ఏ విధంగా పక్కకు పెట్టడం జరిగిందో ,కేంద్ర ప్రభుత్వాలు దేశమంతటా అమలవుతున్న నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంటులో ఎంతవరకు అమలయ్యాయో అరవింద్ సమాధానం చెప్పాలని రాంభూపాల్ డిమాండ్ చేశారు.గత మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ ను స్మార్ట్ సిటీగా చేస్తానని చెప్పి ఇంతవరకు చేయకుండా అరవింద్ విఫలం అయ్యారని, ఖేరో ఇండియా పథకం ద్వారా నిజామాబాద్ కు ఆట మైదానాలకు నిధులు తీసుకురావడంలో విఫలం అయ్యారని, ముద్ర లోన్స్ ద్వారా యువకులకు ఉపాధి కల్పించే విధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీల ఏర్పాటు చేసుకోవడానికి యువకులకు కేంద్రం నుండి లోన్లు ఇప్పించకుండా కేవలం రాజకీయాల కోసం యువతను మతాల పేరుతో రేచ్చగొట్టి ఓట్లు దండుకునే దుర్మార్గపు ఆలోచనలో మీరు ఉన్నారని, నిజామాబాద్ లో వర్షాలు పడితే మోకాళ్ల వరకు నీళ్లు వస్తాయని అరవింద్ మాట్లాడుతూనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు మాత్రం కేంద్రం నుండి నిధులు తీసుకురావడం లేదు అని, సమస్యలు తెలిసినప్పటికీ వాటికి నిధులు తీసుకురాకుండా కేవలం మాటలు చెబుతూ గెలిచిన తర్వాత అధికారాన్ని ఉపయోగించుకుంటూ బాధ్యత రహితంగా అరవింద్ తిరుగుతున్నాడు అనడానికి ఇదే నిదర్శనం అని, నిజామాబాదులో రింగ్ రోడ్డు నిర్మించడానికి కేంద్రం నుండి అదనంగా ఏమైనా బడ్జెట్ తీసుకువచ్చార అని రాంభూపాల్ ప్రశ్నించారూ. రైల్వే ప్రాజెక్టులలో బీదర్ వరకు డబ్బులు లైన్ కావాలని అంటూనే, ధర్మాబాద్ నుండి సికింద్రాబాద్ వరకు రైల్వే ప్రాజెక్టులలో కొంచెం కూడా మార్పు తీసుకురాలేదని, పులాంగ్ వాగు కబ్జాకు గురైతున్న సందర్భంలో పార్లమెంట్ సభ్యుడిగా దానిపై కూడా అరవిందుకు చిత్తశుద్ధి లేదు అని, పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న అరవింద్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వాక్యాలు చేస్తూ అహంకారపు మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు అని, పార్లమెంట్ సభ్యుడిగా కేంద్రం నుండి నిజామాబాద్ కు నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి దోహదపడాలి గాని ఇతర పార్టీ నాయకులపై రాష్ట్ర ముఖ్యమంత్రి పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఆయన స్థాయికి సరైనది కాదు అని, అరవింద్ మాట్లాడుతున్న అహంకారపు మాటలను జిల్లా ప్రజలందరూ గమనిస్తున్నారని, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బిజెపికి రాష్ట్రంలో మూడో స్థానం కల్పించిన విధంగానే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా బిజెపికి గుణపాఠం చెబుతూ మూడో స్థానానికి కైవసం చేస్తారని రాంభూపాల్ అన్నారు.
అదేవిధంగా సోనియా గాంధీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వలసలు ఆపాలనే ఆలోచనతో 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని, కానీ ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం గాంధీ పేరును రూపుమాపాలనే ఆలోచనతో ఆ పథకాన్ని రద్దు చేసి జి రామ్ జి అని కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగిందని, గతంలో 100 రోజుల ఉపాధి హామీ పనికి సంబంధించిన బడ్జెట్ను పూర్తిగా కేంద్రమే భరించేది అని కానీ ప్రస్తుతం కొత్తగా వచ్చిన పథకం ద్వారా పని దినాల్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్రాలు 40 శాతం భరించాలని తీసుకురావడం జరిగిందని, తద్వారా రాష్ట్రాలపై అధిక భారం పడుతుందని తెలంగాణ రాష్ట్రం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బడ్జెట్ను భరించడానికి సిద్ధంగా ఉంది అని కానీ మిగతా రాష్ట్రాలకు ఇది భారంగా అవుతుంది అని, కావున వెంటనే కేంద్ర ప్రభుత్వం తిరిగి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని దీనిపై ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి వ్యతిరేకిస్తామని పేదవాని కడుపు కొట్టిన బిజెపి దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని రాంభూపాల్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,ధర్మ గౌడ్, పత్తి శోభన్, రాజ్ గగన్, అసద్, దత్రిక భాస్కర్, మనోహర్, రాజ్,దిలీప్, శేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు

