
పయనించే సూర్యుడు ఆగస్టు ఒకటి (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల ప్రజలకుఅందుబాటులో ఉండేఅధికారిణిగా MRO శైలకుమారి తక్కువ కాలంలోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. రెవెన్యూ సమస్యలతో కార్యాలయానికి వచ్చే ప్రజలను ఆప్యాయంగా పలకరించి, వారి వినతులను శ్రద్ధగా విని పరిష్కార దిశగా వెంటనే చర్యలు చేపడుతున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. భూ వివాదాలు, పట్టాదారు పాస్బుక్లు, వారసత్వ నమోదు, ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలు వంటి అనేక రెవెన్యూ సేవలను వేగవంతంగా అందించేందుకు కృషి చేస్తున్నారు. సమస్యలను పెండింగ్లో ఉంచకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ త్వరితగతిన పరిష్కరించే విధానాన్ని అవలంబిస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరినీ సమాన దృష్టితో చూసి, వారి సమస్య పరిష్కారమే తన బాధ్యత అనే భావనతో పనిచేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. కార్యాలయంలో పారదర్శకత, సమయపాలన, బాధ్యతాయుత పరిపాలనకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారు. “ప్రజలకు ఇబ్బంది కలగకుండా పని చేయాలి” అనే లక్ష్యంతో పనిచేస్తున్న ఆమె తీరు పలువురి ప్రశంసలు అందు కుంటోంది. ప్రజా సమస్యలపై వేగంగా స్పందించడం, ఫైళ్లను అనవసరంగా పెండింగ్లో ఉంచకుండా పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం ఆమె ప్రత్యేకతగా నిలుస్తోంది. సేవా దృక్పథం, నిబద్ధత, స్పందనతో సూళ్లూరుపేట రెవెన్యూ పరిపాలనలో తనదైన ముద్ర వేస్తూ ప్రజల విశ్వనీయత పొందుతున్న అధికారిణిగా సూళ్లూరుపేట మండలం తాసిల్దారు శ్రీమతి శైలజా కుమారి పేరు నేడు ప్రత్యేకంగా వినిపిస్తోంది.