పయనించే సూర్యుడు. ఏప్రిల్ 14. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్ మండలం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా, డాక్టర్. బి అర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిపారు.
భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న బీ ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా, ఏన్కూర్ లో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు, ప్రజలు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇ సందర్బంగా మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ…దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక, సామాజిక న్యాయ రాజకీయ రంగాల్లో సమన్యాయం ఉండాలని ఆకాంక్షించి , భావి తరాల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని, అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన, భారత రత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్, ఒకవర్గానికి చెందిన వారు కాదని, ఈ సమాజంలోని ప్రజలందరి వారని, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం రాసిన గొప్ప వ్యక్తి, అని ప్రజల హక్కులను కాపాడిన మహోన్నత వ్యక్తి, అని అన్నారు.విద్యాభ్యాసం తరువాత ఆర్థిక వేత్తగా ప్రొఫెసర్ గా, న్యాయవాదిగా పలు పాత్రలు పోసించారని తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతికి విద్యా, ఉద్యోగ, రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, అంబేద్కర్ సూచనలతో కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించడం, తో దళిత గిరిజన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపయన్నారు. ఇ కార్యక్రమంలో నాయకులు ప్రజలు పాల్గొన్నారు. పంతగాని నరేష్ ఏన్కూరు మండలం కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు నిమ్మల నాగేశ్వరరావు
సీనియర్ నాయకులు సీతయ్య మాజీ మార్కెట్ చైర్మన్ సక్రు నాయక్ అజ్మీర సురేష్ పాల రాజశేఖర్ ఏన్కూర్ మండలం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణ ప్రసాద్ మేడ ధర్మారావు మైసారావు కాంగ్రెస్ నాయకులు తదితరులు