పయనించే సూర్యుడు న్యూస్ చివ్వెంల మండల ప్రతినిధి బి.వెంకన్న జనవరి 21... వార్త విశ్లేషణ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం గ్రామంలో ప్రజా పాలన గ్రామసభలు ఏర్పాటు చేసిన అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాల కొరకు జరుగుతున్న గ్రామసభలు ఈరోజు ప్రారంభించడం జరిగింది రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఆరుదులైన లబ్ధిదారులకు చేరేలా పనిచేయాలి అని అధికారులు తమవంతు కృషి చేయాలని ఆర్డీవో అధికారులకు సూచించారు అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామపెద్దలు ప్రజలు ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఆర్డీవో వేణుమాధవ్ చివ్వెంల మండల స్పెషల్ ఆఫీసర్ జగదీశ్ రెడ్డి ఎమ్మార్వో కృష్ణయ్య అగ్రికల్చర్ ఏఈ శైలజ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ పంచాయతీ అధికారులు ప్రజలు పాల్గొన్నారు.