
( పయనించే సూర్యుడు డిసెంబర్ 01 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి , దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఛైర్మన్ లు పాల్గొన్నారు.
