
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
మనస్పర్థలతో విడిపోయిన జంట - పోలీసుల కౌన్సిలింగ్‌తో తిరిగి మళ్లీ ఒక్కటైన దంపతులు
జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన జంట
నిర్మల్ జిల్లా భైంసా ఎస్పీ క్యాంపు ఆఫీస్‌లో నిర్వహిస్తున్న “ప్రజావాణి” కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తూ సత్ఫలితాలు అందిస్తోంది.ఈ కార్యక్రమం ద్వారా అనేక కుటుంబ సమస్యలతో బాధ పడుతున్న వారు పరిష్కారం పొందుతున్నారు.ఈ నేపథ్యంలో, భైంసా పట్టణానికి చెందిన భార్య-భర్తలు గత కొన్ని నెలలుగా మనస్పర్ధలతో దూరంగా ఉంటున్నారు.దీంతో వారు ప్రజావాణి కార్యక్రమాన్ని ఆశ్రయించారు. వారి సమస్యను శ్రద్ధగా విన్న పోలీసులు, కౌన్సిలింగ్ నిర్వహించి పరస్పర అవగాహన కల్పించారు. పోలీసుల సమర్థమైన చొరవతో ఆ దంపతులు తమ విభేదాలను మరచి మళ్లీ కలిసిపోయి ఆనందంగా జీవించేందుకు నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా దంపతులు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ కి, పోలీసు సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
