
రేపాకుల శ్రీనివాస్ సిపిఎంజిల్లాకార్యదర్శి వర్గ సభ్యులు
.
టేకులపల్లి: మంగళవారంనవంబర్ నవంబర్ 5వ తేదీన మంగపేట లో జరిగే సిపిఎం సీనియర్ నాయకులు గుగులోత్ ధర్మ రెండవ వర్థంతి సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు, మంగళవారం నాడు కోయగూడెం లో జరిగిన ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గుగలోత్ ధర్మ కు టేకులపల్లి మండల ప్రజలకు అవినాభావ సంబంధం ఉందని అన్నారు, మండలంలో కోయగూడెం ఓసి నిర్వాసితులు,పోడు భూముల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాల నిర్వహించారన్నారు,గుగులోత్ ధర్మ రెండవ వర్థంతి సందర్భంగా మంగపేటతండ వద్ద విగ్రహావిష్కరణ,స్థూపావిష్కరణ సభ ఉంటుందన్నారు,ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొంటారని తెలిపారు,ఈ సభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు,ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఈసం నర్సింహారావు, మండల కమిటీ సభ్యులు కడుదుల వీరన్న,పూనెం స్వామి, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.