పయనించే సూర్యుడు జనవరి 21(మేడ్చల్ నియోజకవర్గం ప్రతినిధి మాధవరెడ్డి)
ప్రజా పాలన వార్డు సభలను మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధి లోని 4వ వార్డు ఆర్.యల్.నగర్ లో నిర్వహించిన వార్డు సభను మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాధికా గుప్తా పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, కమీషనర్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.