పయనించే సూర్యుడు జనవరి 31 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్
దళిత సంఘాలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల కేంద్రంలో గద్దర్ 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది గద్దర్ చిత్రపటానికి పూలమాలలు పుష్పములతో స్వీట్లు పండ్లు పంపిణీతో బహుజన మహనీయుల జయంతి వర్ధంతి ఉత్సవాల కమిటీ చైర్మన్.మాజీ సర్పంచ్ నార్లగిరి శ్రీనివాస్.దళిత శక్తి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొంకూరి రాజు,భావన నిర్మాణ సంక్షేమ మండలి మండల అధ్యక్షులు రేణిగుంట్ల సాంబయ్య యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంబాల శ్రీకాంత్.యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శనిగరపు సాహూ. మాజీ సర్పంచ్ ఆరెపల్లి రాజయ్య,సిపిఐ మండల నాయకులు శనిగరపు రాజకుమార్.ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ ఐక్యవేదిక కన్వీనర్ కో కన్వీనర్ జల్లి సారయ్య, వేముల కృష్ణకర్,నాగయ్య, ఆటోయూనియన్ నాయకులు మాటూరి శ్రీనివాస్, ఎండి మదర్, ఎల్కతుర్తి మండల బహుజన మహిళ కన్వీనర్ కొయ్యడ సునీత, కోకన్వీనర్ దుర్గం శారద,శ్రీలత, వికలాంగుల సంక్షేమ మండలి మండల కన్వీనర్ అంబాల సంతోష్,ఇమ్మడి మాణిక్యం,కే రాజేష్,జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి.శనిగరపు వెంకటేష్.గద్దర్ జయంతోత్సవం ప్రత్యేకతను తెలియపరచుతూ ఎల్కతుర్తి మండల కేంద్రానికి గద్దర్ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరుబాట పాదయాత్రతో తెలంగాణ మారుమూల పల్లెలు పాదయాత్ర చేశారు తెలంగాణ గుండె చప్పుడు ఎల్కతుర్తి మండల కేంద్రంలో 2012లో జూన్ 26న బహిరంగ సభలో మనతో కలిసి పాల్గొన్నారు.గద్దర్ నక్సలిజం సిద్ధాంతం కోసం తను తన ప్రాణాలను సైతం పోగొట్టుకునే అనేక సార్లు ప్రజల కోసం జీవించి బ్రతికి ప్రజల పక్షం రాజ్య హింసకు వ్యతిరేకంగా నక్సలిజాన్ని నమ్మి తన సర్వస్వం త్యాగం చేశారు.అంబేద్కర్ సిద్ధాంతం బుద్ధిష్టుగా భారత రాజ్యాంగాన్ని పాసిస్ట్ బిజెపి దొరల టిఆర్ఎస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షంగా తను మరణించే వరకు పోరాడాడు ప్రజా పోరులో ప్రజల పక్షం ప్రజా జీవితం తాను తనకంటూ ఏమీ ఆశించకుండా సమ సమాజ బహుజన సమాజం కోసం నిర్వీరామం కృషిచేసి నారు దొరల పాలన తెలంగాణ రాష్ట్రంలో పోవాలని ప్రజల పక్షంగా పోరాడి నాడు కేంద్రంలో బిజెపి రైతులకు వ్యతిరేక చట్టాలు హక్కుల సంఘాలను తుదముట్టించుటకు పీడీ చట్టాలను కాసాయ కర్ణ పేరుతో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలను సమాధి చేసే కేంద్ర సర్కార్ బిజెపిని ఓడించాలని కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నడు.గద్దర్ సన్మానాలను సత్కారాలను అవార్డు రివార్డులను ఏనాడు స్వీకరించలేడు ఏ రోజు ఆశించలేదు ఇలాంటి చర్యలకు చాలా దూరం తను తన కుటుంబం సర్వస్వం త్యాగంతో జీవించినారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన హోదా స్థాయిని మరిచిపోయి దిగజారుడుగా గద్దర్ ఫై అనుచిత వాక్యాలు చేసిన వాటిని వెంటనే రద్దు చేసుకొని క్షమాపణ కోరాలి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నం