షాద్నగర్ ఆర్డీవోకు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేత
( పయనించే సూర్యుడు మార్చి 20 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి నరేందర్ నాయక్ )
షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవో గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మి క సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించి ఇవ్వాలని ఆసరా పెన్షన్లు ఇవ్వాలని మరియు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు కనీస పని దినాలు 200 రోజులకు పెంచాలని పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ నిధులను విడుదల చేయాలని కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జాబ్ కార్డు ఇచ్చి పని కల్పించాలని రోజువారీ కనీస వేగనం 800 పెంచాలని ఆయన డిమాండ్ చేశారు అదేవిధంగా పని ప్రదేశంలో ఉపాధి హామీ కార్మికులకు సేఫ్టీ పరికరాలు మెడికల్ కిట్టు మంచినీటి సౌకర్యం తదితర సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు నర్సింలు యాదయ్య కృష్ణయ్య చంద్రకళ లక్ష్మయ్య తులసి అంజలి లింగమ్మ బుడ్డమ్మ నర్సింలు తదితరులు పాల్గొన్నారు