సామాజిక కార్యకర్త నరేష్ బాబు
పయనించే సూర్యుడు జనవరి 30(మేడ్చల్ నియోజకవర్గం ప్రతినిధి మాధవరెడ్డి)
ప్రజా సమస్యలు సమాజ అభివృద్ధికి అడ్డుగోడగా మారకూడదు. నిరుద్యోగం, విద్యాహక్కు, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, మరియు సమానత్వం సమస్యలపై ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలి. హక్కులను వినియోగించుకోండి సమాజం మారాలి అంటే మనమే మారాలి
అనే స్ఫూర్తితో ప్రజావాణి ద్వారా నమోదు కాపాడుతున్నటువంటి సమస్యలు ఏ స్థాయిలో పరిష్కరించబడుతున్నాయి అనే ఉద్దేశంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోని ఉన్న 139ప్రభుత్వ కార్యాలయాల్లోనమోదయినటువంటి ఫిర్యాదులను పరిష్కరించడం కోసం మరియు ఆయొక్క సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయని తెలుసుకోవడం కోసం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా వివరాలు సేకరించడం జరిగింది. అందులో భాగంగా జనవరి 2021 నుండి అక్టోబర్ 2024 వరకు ప్రజావాణిలో తీసుకున్న దరఖాస్తులు మొత్తం 8839 డిస్పోజ్డ్ గ్రీవెన్స్ దరఖాస్తులు 5412 పెండింగ్ ఉన్నవి 3427 దీనిలో ఎక్కువ డిస్పోజ్డ్ గ్రీవెన్స్ దరఖాస్తులు ఉన్నాయి మూడు వేలకు పైగా గ్రీవెన్స్ పెండింగ్ లో ఉన్నాయి వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించడం కోసం మరొకసారి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇస్తాను.