
ప య నించే సూర్యుడు జూన్ 26 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) భారతీయ జనతా పార్టీ డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జనతా వారధి’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అమలాపురంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలు, వినతులను పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.జిల్లా జనతా వారధి కన్వీనర్ చీకరమెల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్ల పవన్ కుమార్, జిల్లా మాజీ అధ్యక్షుడు కర్రి చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన వినతులను పరిశీలించిన నాయకులు సంబంధిత శాఖల అధికారులతో వెంటనే సంప్రదించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కొన్ని సమస్యల పరిష్కారానికి తక్షణ స్పందన వచ్చేలా చర్యలు ప్రారంభమైనట్లు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వేదికగా ‘జనతా వారధి’ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనతా వారధి కో-కన్వీనర్ దాట్ల వెంకట సుబ్బరాజు, అమలాపురం టౌన్ అధ్యక్షుడు అయ్యాల భాస్కరరావు, జిల్లా మాజీ కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మన్నె రామదాస్, అమలాపురం టౌన్ మండల మాజీ అధ్యక్షుడు ఆరిగెల తేజ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.