
పయనించే సూర్యుడు నవంబర్ 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాలజిల్లా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఈరోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు నిర్వహించిన "ప్రజా దర్బార్" కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ వేదిక ద్వారా పలువురు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి మంత్రివర్యులు ఫరూక్ స్వయంగా అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ఆయన తక్షణమే ఆయా సమస్యలకు సంబంధించిన శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నంద్యాల నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
