
పయ నించు సూర్యుడు ఏప్రిల్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం మురమళ్ళ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను వివరించి ఆర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ శాసనసభ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి పాల్గొన్నారు. అందిన ఆర్జీలను శాసనసభ్యులు శ్రద్ధగా పరిశీలించి, తక్షణ పరిష్కారం సాధ్యమైన సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరింత పరిశీలన అవసరమైన అంశాలను సంబంధిత శాఖలకు ఆన్లైన్ ద్వారా పంపిస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి ఆర్జీకి సముచిత న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.