
పయనించే సూర్యుడు ఆగస్టు 24 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)గొల్లపాలెంలో మంత్రి సుభాష్ విస్తృత ప్రచారం
ఇంటింటికీ తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు మచంద్ర పురం నియోజకవర్గంలోని కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందన్నారు. పేదలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.గత రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు, విద్యా మరియు వైద్య రంగాల బలోపేతం, మహిళా సాధికారత, రైతు సంక్షేమం వంటి అనేక రంగాల్లో ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందని వివరించారు. అదే విధంగా రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.ప్రజల వద్దకు నేరుగా వెళ్లి ప్రభుత్వ పనితీరు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకోవడమే ఈ ఇంటింటికీ ప్రచార కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలు, సూచనలు ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉంటాయని చెప్పారు.మంత్రి సుభాష్ కు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై తమ సంతృప్తిని వ్యక్తం చేస్తూ స్థానిక సమస్యలను మంత్రికి వివరించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, టిడిపి మండల అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి, కూటమి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.