శ్రీనివాసరావు. పయనించే సూర్యుడు మార్చి 7 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. తెలంగాణ రాష్ర్ట,ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గం,వెంసూరు మండలం ,కుంచపర్తి లాకులు ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి రావాల్సిన సాగునీటిని తెలంగాణ సరిహద్దు కుంచపర్తి లాకులు వరకు మాత్రమే పరిమితం చెయ్యడముతో తిరువూరు నియోజకవర్గంలోని విసన్నపేట,తిరువూరు మండలాలకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ శాసన సభ్యులు వారిని కలిసి వారి సమస్యలను తెలపడం జరిగినది. సమస్య తెలుసుకున్న శాసన సభ్యులు వారు నిన్నటి రోజున తానే స్వయముగా వెళ్లి ఆ కుంచపర్తి లాకులను చూసి ఎక్కడ వరకు నీరు వస్తుంది మనకు ఎందుకు రావడం లేదో ..అన్ని వివరాలను సంబధిత అధికారులతో చర్చించి తెలుసుకోవడం జరిగినది.
ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణములో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిసి నీటి సమస్య గురించి వివరించి మాట్లాడగా.నీటి పారుదల శాఖ మంత్రి సంబంధిత తెలంగాణ అధికారులతో మాట్లాడటం జరిగినది. ఎలాగైనా తిరువూరుకి సాగునీరు అందేలా చేస్తానని మంత్రి చెప్పడం జరిగినది.