పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం రోజున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంద్ర – స్వచ్చంధ్ర .ఎస్ ఏ ఎస్ ఏ కార్యక్రమములో భాగంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అంశం పై ప్రతి మున్సిపాలిటి నందు కార్యక్రమం నిర్వహించవలసినదిగా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు పురపాలకసంఘ కార్యాలయ ఆవరణం నందు మునిసిపల్ చైర్ పర్సన్ కుమారి.గోపారం వెంకట రమణమ్మ . ఇంచార్జ్ మున్సిపల్ కమీషనర్ .డి.మాధవి . ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ .శేఖర్ ఆద్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమము నిర్వహించడం జరిగినది. పై కార్యక్రమము నందు మున్సిపల్ వైస్ చైర్మెన్ షేక్.సర్దార్ , పట్టణ టి.డి.పి అధ్యక్షులు తుమ్మల చంద్రా రెడ్డి . వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు ఆత్మకూరు రేంజ్ విభాగంలోని ఫారెస్ట్ సిబ్బంది పాల్గొని ప్రజలుకు పర్యావరణ పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ భాద్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షణ భాద్యతలు కూడా చేపట్టాలని తెలియజేయడం జరిగినది.