
పుడమి ఫౌండేషన్ రెండవ దశ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం.
మహనీయుల బాటలో నడిచినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుంది.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్మన్ అశోక్ కుమార్
పయనించే సూర్యుడు ఏప్రిల్13మక్తల్
మహాత్మ జ్యోతిబాపూలే,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పుడమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫౌండేషన్ చైర్మన్ జె వెంకటపతి రాజు మాట్లాడుతూ రక్తదానం చేయండి ప్రాణదాతలు నిలవండి అని అన్నారు.రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నారాయణపేట జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అశోక్ సార్. ఈ శిబిరానికి రూబెన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రక్తదానం శిబిరాన్ని ఉద్దేశించి అశోక్ సార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జ్యోతిబాపూలే డాక్టర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని కోరారు. అలాగే రక్తదానం చేయడం వల్ల మనం ఒకరి ప్రాణాలు కాపాడిన వాళ్ళo అవుతామణి, ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన కూడా మీ ఫౌండేషన్ కు అభినందనలు తెలియజేశారు. అలాగే వివిధ సేవా కార్యక్రమాలలో కూడా పుడమి ఫౌండేషన్ చురుకుగా ఉంటూ విద్యా వ్యవసాయంలో కూడా రైతులకు నూతన మేలుకువలు సలహాలు సూచనలు చేయడంలో ఫౌండేషన్ ముందుకెళ్లాలని ఆశించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒకటో వార్డ్ కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి మరియు తెలంగాణ ఉద్యమకారుడు నీలప్ప అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి. Ag భూట్టో, బాలరాజ్, NSUI అప్రోజ్,బి వెంకటేష్,బాబు,యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు బి.సురేష్, రాజేష్. బీరప్ప. తరుణ్. నవీన్. తదితరులు పాల్గొన్నారు*