షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
లింగారెడ్డి గూడా గ్రామానికి చెందిన పకీర్ పాషా కుటుంబ సభ్యులకు 2.5 లక్షల ఎల్.ఓ.సి ని అందజేసిన ఫరూక్నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి
ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపిన కుటుంబ సభ్యులు
( పయనించే సూర్యుడు ఆగస్టు 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
పేదల ఆరోగ్యమే తమ ప్రభుత్వానికి ప్రధానమని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డి గూడా గ్రామ నివాసి ఎండి పకీర్ పాషా ఆరోగ్యం బాగోలేదని ఫరూక్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి ద్వారా తేలుసుకున్నటువంటి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అతని వైద్య ఖర్చుల నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో వైద్యము నిమిత్తం 2.50 లక్షల ఎల్ఓసిని మంజూరు చేయించడం జరిగింది. ఈ ఎల్. ఓ. సి.ని ఫరూక్ నగర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి మరియు లింగారెడ్డి గూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు నీమ్స్ హాస్పిటల్ కి వెళ్లి అతనికి ఎల్.ఓ.సి ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫకీర్ పాష కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే శంకర్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లింగారెడ్డి గూడా గ్రామ కమిటీ అధ్యక్షుడు రంగంపల్లి సురేష్ గౌడ్, మాజీ డిప్యూటీ సర్పంచ్ మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ గౌడ్, ఏం .మల్లేష్ పాల్గొన్నారు.