పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 22. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ ప్రతి మండలంలో రెండు పాఠశాలల్లో రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ గ్రంథాలయ సంస్థ కార్యకలాపాలపై సమీక్ష చేసిన అదనపు కలెక్టర్ ప్రతి మండలంలో రెండు పాఠశాలల్లో రీడింగ్ రూమ్ లు ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఛాంబర్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ విద్యార్థులకు పుస్తక పఠనం పై ఆసక్తి కలిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి మండలంలో రెండు పాఠశాలలను ఎంపిక చేసి, రీడింగ్ రూమ్ ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. గ్రంథాలయ సంస్థకు రావాల్సిన సెస్ వసూలుపై దృష్టి పెట్టాలన్నారు.గ్రంధాలయాల మరమ్మత్తులు, అభివృద్ధి పై దృష్టి పెట్టాలన్నారు. నిధుల లేమి కారణంగా నిలిచిన పనులను అందుబాటులో ఉన్న నిధులతో పూర్తి చేయాలన్నారు.గ్రంథాలయం ద్వారా గత సంవత్సర నిధుల కేటాయింపు, ఖర్చు, రాబోయే సంవత్సరం నిధుల ప్రతిపాదనలు సమగ్రంగా అన్ని వివరాలతో రూపొందించి, సంస్థ సభ్యుల సమావేశం వచ్చే వారంలో ఏర్పాటుచేసి, సభ్యుల తీర్మానం పిదప ఆమోదానికి పంపాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, జిల్లా గ్రంధాలయ సంస్థ ఇంచార్జ్ కార్యదర్శి అర్జున్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.