స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేసిన అధికారులు,ప్రజాప్రతినిధులు,ప్రజలు,ఆదివాసీ జేఏసీ నాయకులు.
అల్లూరి జిల్లా,దేవిపట్నం మండలం పయనించే సూర్యడు చిహెచ్.విద్యా సాగర్ జనవరి 18.... ఇందుకూరు రెవెన్యూ గ్రామపంచాయతీ సర్పంచ్ కోసు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం,ఇందుకూరు రెవెన్యూ గ్రామంలో ఉన్న చెత్త నుండి విద్యుత్ తయారి కేంద్రం వద్ద స్వేచ్ఛ ఆంధ్ర స్వేచ్ఛ దివాస్ కార్యక్రమాన్నికి ముఖ్య అతిథులుగా దేవీపట్నం ఎంపీడీవో డిఎన్.రత్నకుమారి,దేవి పట్నం మండల వ్యవసాయ శాఖ అధికారిని ప్రశాంతి పాల్గొన్నరన్నారు.ఈ సందర్భంగా ఎంపీడీవో డిఎన్.రత్నకుమారి మాట్లాడుతూ… దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నెలలో ఒక శనివారం "స్వచ్ఛత" కోసం అంకితం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపుమేరకు ఇకపై ప్రతి మూడు శనివారం స్వేచ్ఛ ఆంధ్ర - స్వేచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు.ఈనెల 18వ తేదీన కడప జిల్లా మైదుకూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రస్థాయి నుండి గ్రామస్థాయి అధికారులు వరకు ప్రతి ఒక్కరు అంకితభావంతో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.సత్ఫలితలను ఆశిస్తూ ఈ నెల నుండి వచ్చే 12 నెలల పాటు నెలకొక థీమ్ తో 12 మాసాలకు 12 థీమ్ లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. జనవరి మాసంలో న్యూ ఇయర్ - క్లీన్ స్టార్ థీమ్ తోను,ఫిబ్రవరి మాసంలో సోర్స్ రిసోర్స్ థీమ్ తోను,మార్చిలో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ - ప్రమోట్ రీయూజబుల్స్ థీమ్ తోను,ఏప్రిల్ లో ఇ - చెక్ థీమ్ తోను,మే లో నీరు మీరు థీమ్ తోను,జూన్ లో బీట్ ది హీట్ థీమ్ తోను,జూలై లో ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ థీమ్ తోను,ఆగస్టులో మాన్ సూన్ హైజనిక్ థీమ్ తోను,సెప్టెంబర్ లో గ్రీన్ ఏపి థీమ్ తోను,అక్టోబర్ లో క్లీన్ ఎయిర్ థీమ్ తోను,నవంబర్ లో పెర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజిన్ థీమ్ తోను,మరియు డిసెంబర్ మాసంలో ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్ థీమ్ తోను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా దేవిపట్నం మండల వ్యవసాయ శాఖ అధికారిని ప్రశాంతి మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణ అంశంలో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ను ప్రోత్సహించడం,పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ప్రజా ఆరోగ్య పరిరక్షణ,పర్యావరణంపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించడం,పర్యాటకులు,యాత్రికులు మరియు పెట్టుబడుదలను మరింత ఆహ్వానించే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణన్ని కల్పించడం,ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరచడం మరియు పిల్లల భవిష్యత్ తరాల వారికి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం అనే లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనంతరం అందరం కలిసి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేసామన్నారు. కార్యక్రమంలో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అధార్టీ రాజమహేంద్రవరం, మండల న్యాయ సేవాధికార సంస్థ రంపచోడవరం పారా లీగల్ వాలంటీర్ ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్,డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అధార్టీ రాజమహేంద్రవరం, మండల న్యాయ సేవాధికార సంస్థ రంపచోడవరం పారా లీగల్ వాలంటీర్ యలగాడ నాగేశ్వరరావు,డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమహేంద్రవరం, మండల న్యాయ సేవాధికార సంస్థ రంపచోడవరం పారా లీగల్ వాలంటీర్,దేవీపట్నం బిజెపి మండల అధ్యక్షుడు కారం రామన్న దొర,కట్టా రాజు, కురుపల్లి త్రిమూర్తులు,కానూరు రామకృష్ణ,కానూరు సత్యనారాయణ,మదాల షణ్ముఖ సాయి,జి.వీరబాబు,బదిరెడ్డి త్రిమూర్తులు,బదిరెడ్డి దుర్గాప్రసాద్,కొట్టం లక్ష్మణ్,మన్నేపల్లి నాగేంద్ర,ఈరేటి రమణ,బందులు సతీష్,ఈరేటి రాంబాబు,ఇన కోటి ఏడుకొండలు, మరియు గ్రామపంచాయతీ సెక్రెటరీ పద్మశ్రీ,అగ్రికల్చర్ అసిస్టెంట్ సాయి షర్మిల,సర్వేయర్ జయలలిత,వెటర్నరీ అసిస్టెంట్ రామకృష్ణ,ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణ,ఇంజనీరింగ్ అసిస్టెంట్ సత్య వేణి,మహిళా పోలీసు రాజేశ్వరి మొదలైన వారు పాల్గొన్నరన్నారు.