
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య , లక్ష్మీకాంత్ రెడ్డి
{ పయనించే సూర్యుడు} {మార్చు 11మక్తల్ }
మక్తల్ పట్టణంలోని బిజెపి పట్టణ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశపు అతిపెద్ద క్రీడా వేడుక ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాలమూరు పార్లమెంటు పరిధిలో నీ మన పార్లమెంటు సభ్యులు డీకే అరుణమ్మ ఆధ్వర్యంలో అన్ని మండలాలు మరియు నియోజకవర్గ కేంద్రాల్లో పార్లమెంటు స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రికెట్, కబడ్డీ, కోకో, వాలీబాల్, పరుగు పందెం క్రీడలను మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రీడాకారులు మరియు యువత ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శిస్తూ క్రీడాస్పూర్తిని చాటాలని కోరుతున్నామని అన్నారు. 16 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల కు ఉన్నవారందరికి పురుషులు మరియు మహిళలకు వేరువేరుగా పోటీలను నిర్వహిస్తున్నమని అన్నారు. మార్చి 9 నుండి 24 వరకు QR కోడ్ (స్కానర్) ద్వారా లేదా ప్రతి మండలంలో ఇన్చార్జి ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. ఏప్రిల్ 9 నుండి 24 వరకు క్రీడా పోటీలను మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ,పార్లమెంటు స్థాయిలో నిర్వహిస్తున్నామని అన్నారు. అందరూ కూడా ఈ యొక్క క్రీడా పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు కర్ని స్వామి , భూత్పూరు మాజీ సర్పంచ్ హనుమంతు, కనకరాజు, వాకిటి మల్లేష్ మండల అధ్యక్షులు జయానంద రెడ్డి, ప్రతాప్ రెడ్డి, నల్లే నర్సప్ప, BJYM జిల్లా నాయకులు భరత్, మాధ్వార్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,మంజు రాజశేఖర్ , విజయ్ కుమార్ కౌన్సిలర్లు పీకే నరసింహ, టప్ప కృష్ణ, మాజీ మండల ప్రధాన కార్యదర్శి వన్నాడ శ్రీకాంత్ ,పట్టణ ప్రధాన కార్యదర్శులు నరేందర్ టప్ప అశోక్, శివరాములు, ఆంజనేయులుచందాపూర్ రాము, రాకేష్, నాగరాజు ,ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
