పయనించే సూర్యుడు అక్టోబర్ 8, నంద్యాల జిల్లా రిపోర్టర్లు జి పెద్దన్న
శ్రీశైలంలోని పవిత్ర క్షేత్ర వాతావరణంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అడుగు పెట్టనున్న వేళ జనసేన నాయకులు, నిత్య అన్నదాన దాత భవనాసి (శ్రీనివాసు) వాసు, నాగి వెంకటేశ్వర్లు ప్రజలతో కలిసి పర్యటనను ఘనవిజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16న జరగనున్న ప్రధానమంత్రి యాత్రకు సంబంధించి వారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భవనాసి వాసు మాట్లాడుతూ—“శ్రీశైలం భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక. అటువంటి స్థలానికి ప్రధానమంత్రి రాక తెలుగు ప్రజలకు గర్వకారణం. దేశాన్ని అభివృద్ధి ప్రస్థానంలో ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోదీ ఈ యాత్ర చారిత్రాత్మకంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం” అన్నారు. నాగి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ—“భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మికత ఉజ్వలమైన మార్గదర్శకం. అటువంటి విలువలను పరిరక్షిస్తున్న ప్రధాని శ్రీశైలాన్ని దర్శించుకోవడం ప్రజల జీవితాల్లో స్ఫూర్తి నింపుతుంది. ఈ పర్యటన విశ్వాసానికి, అభివృద్ధికి, ఏకతకు చిహ్నంగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు. ప్రధాని రాక సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, భక్తులు సమన్వయంగా పనిచేసి కార్యక్రమం విజయవంతం చేయాలని ఇద్దరూ కోరారు. దేశవ్యాప్తంగా శ్రీశైలం క్షేత్రానికి మరో గుర్తింపు ఇవ్వనున్న ఈ పర్యటనలో ప్రతి తెలుగు భక్తుడూ పాల్గొని గౌరవించాలన్నారు. భవనాసి వాసు, నాగి వెంకటేశ్వర్లు నేతృత్వంలో స్థానిక జనసేన కార్యకర్తలు పర్యటన ఏర్పాట్లకు తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధమయ్యారు.