పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్
ది.24 వ తేదీన ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాని పురస్కరించుకొని, చింతూరు KGBVఉన్నత పాఠశాల నుండి పాఠశాల విద్యార్థి, విద్యార్థునులతో ర్యాలీ కి చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గౌరవ అపూర్వ భారత్ IAS గారు పచ్చ జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించడం జరిగినది. ఈ ర్యాలీ చింతూరు ITDA నుండి మెడికల్ కాలనీ, CPM ఆఫీస్, చింతూరు మెయిన్ సెంటర్ మీదుగా డిప్యూటీ ఆఫీస్ వరకు కొనసాగినది. ఈ ర్యాలీ లో ప్రజల కు క్షయ వ్యాధి గురించి అవగాహన కలిగే విధంగా,క్షయ వ్యాధి లక్షణాలు, వ్యాధి వ్యాపించిడానికి గల కారణాలు వీధులలో నినాదాలు ఇవ్వడం జరిగినది. ఈ ర్యాలీ ని ఉద్దేశించి గౌరవ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గారు మాట్లాడుతూ TB అంతం మన పంతం అనే నినాదం తో ప్రతీ ఒక్కరు TB వ్యాధిని అరికట్టడానికి కృషి చేయాలని తెలియ చేసినారు. మరియు డిప్యూటీ డీఎం& హెచ్ ఓ Dr పుల్లయ్య గారు మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, అలసట, బరువు తగ్గడం మొదలగు లక్షణాలు ఉన్న వారిని క్షేత్ర స్థాయి లో ANMs మరియు ఆశ కార్యకర్తలు వెంటనే గుర్తించి PHC కి తీసుకుని వచ్చి తెమడ పరీక్ష చేయించి వెంటనే మందులు వాడించాలని తెలియ చేసినారు. అలాగే TB వ్యాధిని సమాజం నుండి నిర్మూలించడానికి ప్రతీ వ్యక్తి ఒక నాయకుడిగా వ్యవహరించి క్షయ(TB) కి వ్యతిరేకంగా పోరాటం వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన డివిజన్ పరిదిలో జనవరి 2025. నుండి ఇప్పటి వరకు 36 క్షయ (టిబి)కేసులు నమోదు ఇవినవి, ప్రతి టిబి వ్యాధి తో బాధపడేవారికి పోషక ఆహార నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నెలకు 1000 చొప్పున వారి యెక్క బ్యాంకు ఎకౌంటు లో DBT ( నేరుగా లబ్ధిదరిని బ్యాంకు ఖాతాలో)ద్వారా జమ చేస్తుంది అని వివరించారు ఈ కార్యక్రమం లో Dr,MOTC Dr SrinivasaDora Dr, Nikhil STS(Senior Treatment Supervisor) R. Ramanjaneyulu, MPHEO Ramprasad , , PHC తులసిపాక Supervisors, MLHPs (CHOs ) హెల్తసిస్టెంట్స్ ANMs , ఆశకార్యకర్తలు పాల్గొనడం జరిగినది.