పయనించే సూర్యుడు ఫిబ్రవరి 2 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్:- గత సంవత్సరం ఇదే రోజున అనగా, 2.2.2024 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని పురస్కరించుకొని,కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం,హాసన్ పర్తి ఆవరణలో సుమారు 350 నీడ మొక్కలు,పండ్ల మొక్కలు,పూల నిచ్చే మొక్కలు,యునైటెడ్ ఫోరం ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, వరంగల్ యుఎఫ్ఈపి నేతృత్వం లో డిఆర్ఓ వై.వి గణేష్ సౌజన్యంతో నాటించడం జరిగింది.ఒక సంవత్సరంగడిచిన సందర్భంగా వినూత్నవిధంగా మొక్కలకు నేడు మొదటి పుట్టిన రోజు వేడుక నిర్వహించడం జరిగింది. మరియు ఒక 50ఎత్తైన రావి,వేప,జువ్వి మొక్కలు ఖాళీల లో భర్తీ చేయడం జరిగింది.ఈ ఆనవాయితీని కొనసాగించడం ద్వారా మొక్కల రక్షణ బాధ్యత చేపట్టే వీలు ఉంది.. తర్వాత యు ఎఫ్ఇపి ప్రధాన కార్యదర్శి T. శ్రవణ్ కుమార్ అధ్యక్షతన విద్యార్థినులను ఉద్దేశించి ఏర్పాటయిన అవగాహనా సదస్సులో మొదట కీ.శే.నల్లెల్ల రాజయ్యపర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక కోశాధికారికి శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించడం జరిగింది కేజీబీవీ లో చెట్లునాటే కార్యక్రమానికి ముఖ్య భూమిక పోషించిన కీ.శే.రాజయ్య జ్ఞాపకార్దం నల్లెల్ల రాజన్న స్మృతి వనంగా నామకరణం చేయడం జరిగింది.ముఖ్య అతిథి వై.వి గణేష్,జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ,వాతావరణ మార్పుకు నేడు మొక్కే దిక్కు అన్నారు.అలాగే నేడు నాటిన మొక్కలకు నీటిని ఇవ్వడం ద్వారా సంరక్షణ చర్యలు చేపట్టి ఈ కేజీబీవీ అందరికీ ఆదర్శం కావాలని అన్నారు.కాజీపేట పురుషోత్తం విశ్రాంత జిల్లా అటవీ శాఖ అధికారి మరియు ప్రెసిడెంటు యునైటెడ్ ఫోరం ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మాట్లాడుతూ మూడు చక్కటి సంరక్షణ చర్యలు చేపట్టి చూపిన వారికి బహుమతులను ప్రకటించారు.తదుపరి వారిచే వన ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమం లో వరంగల్ మున్సిపల్ నగర పాలక ఉద్యాన వన అధికారి B. రమేష్ మొక్కలను అందించారు.అలాగే వీరికి కావాల్సిన పూలమొక్కలు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు యూఎఫ్ ఈ పి కోశాధికారి వి.సుధాకర స్వామి,కార్యవర్గ సభ్యులు, ఇందారపు నాగేశ్వర్ రావు,ఓ డబ్ల్యు ఎల్ ఎస్ అధ్యక్షుడు ఆకుతోట శాంతారాం కర్ణ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అవశ్యకత వివరించి చెట్లు సంరక్షణ గురించి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కోరారు. కేజీబీవీ.పిఈటి అనూష, తదితరులు పాల్గొన్నారు.