పయనించే సూర్యుడు: ఏప్రిల్ 25: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ. వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో శుక్రవారం భద్రాచలం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే వాజేడు మండలం కేంద్రంలో పేరూరు మరియు వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు డాక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం (ఏప్రిల్ 25) ర్యాలీలో భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొనడం జరిగింది. ఆయన మాట్లాడుతూ (WHO) ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల మేరకు 2030 నాటికి మలేరియా రహిత దేశంగా తీర్చిదిద్దాలని, దానికి తగినటువంటి వైద్యులు కృషి చేయాలని పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. ప్రజల ఆవాసాలు - దోమలకు నివాసాలు కావద్దని ఆరోగ్యం - ఒక సంపద అని దోమలు పుట్టకుండా చేయండిఅని దోమలు కుట్టకుండా చూసుకోండి అని తెలియజేశారు. ఈయొక్కకార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు మండల స్థాయి అధికారులు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎగ్గడి అంజయ్య , తహసిల్దార్ శ్రీనివాస రావు , ఎంపీడీవో విజయ్ , వాజేడు వైద్యాధికారులు డాక్టర్ మహేందర్ , డాక్టర్ మధుకర్, డాక్టర్ జ్ఞానస , హెచ్ ఇ ఓ వేణుగోపాలకృష్ణ, హెల్త్ సూపర్వైజర్ కోటి రెడ్డి, వెంకటరమణ, ఆరోగ్య కార్యకర్తలు నాగేంద్ర కుమారి, సత్య నాగవేణి, కన్యాకుమారి ,రాజేశ్వరి, ఛాయాదేవి, లలిత, మగ ఆరోగ్య కార్యకర్తలు తిరుపతి, శేఖరు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.