11.0 లక్షలు విరాళం అందించిన బింజుసారియా ఇస్పత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం
( పయనించే సూర్యుడు మే 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ పట్టణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి కొత్తూరు మండలంలోని తీగాపూర్ గ్రామంలో ఉన్న బింజుసారియా ఇస్పత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాని వినోద్ కుమార్ జి కేడియా తన తండ్రిగారైన భన్వరీ లాల్ జి జ్ఞాపకార్థం 11.0 లక్షల రూపాయల విరాళాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కి అందించారు. ఈ సందర్భంగా కంపెనీ యాజమాని వినోద్ కుమార్ జి కేడియా మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలో చవివే పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలానే ఉద్దేశ్యంతో కళాశాల నిర్మించడం గొప్ప విషయం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మోముల బసప్ప, హితేష్ కేడియా తదితరులు పాల్గొన్నారు.