ఐటీడీఏ. ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్
పయనించే సూర్యుడు మే05 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్వస్శక్తితో కుటీర పరిశ్రమ నెలకొల్పుకొని వారి కుటుంబాన్ని పోషించుకోవడమే కాక పదిమందికి ఉపాధి కల్పించడం సంతోషకరమని, అలాగే మార్కెట్ పరంగా వెసులుబాటు కల్పించుకొని ఆర్థికంగా లాభాల బాటలో నడవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
సోమవారం నాడు తన చాంబర్లో దుమ్ముగూడెం మండలం అంజుబాక గ్రామానికి చెందిన శ్రీ ముత్యాలమ్మ యాష్ బ్రిక్స్ యూనిట్ సభ్యులకు ఐదు లక్షల రూపాయల చెక్కును అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులైన గిరిజన యువతి, యువకులు 19 లక్షల 80,000 సబ్సిడీతో 33 లక్షల ఖర్చుతో నిర్మాణం చేపట్టిన శ్రీ ముత్యాలమ్మ యాష్ బ్రిక్స్ యూనిట్‌ను గిరిజన యువతి యువకులు అందరూ కలిసికట్టుగా ఉండి చిన్న తరహా పరిశ్రమ నెలకొల్పుకొని జీవనోపాధి పెంపొందించుకోవడం చాలా అభినందించదగ్గ విషయమని అన్నారు. యూనిట్ కాస్ట్ మరియు ఇటుకల తయారీ మరియు మార్కెటింగ్ సౌకర్యం గురించి యూనిట్ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొంది జీవనాధారం పెంపొందించుకోవడానికి 33 లక్షల కాస్ట్ తో శ్రీ ముత్యాలమ్మ యాష్ బ్రిక్స్ యూనిట్ నెలకొల్పుకొని, తయారుచేసిన సిమెంట్ ఇటుకలను మార్కెటింగ్ సౌకర్యం కల్పించుకొని అమ్మకాలు జరుపుకొని లబ్ధి పొందాలని అన్నారు. యూనిట్ ఏర్పాటుకు33 లక్షలు యూనిట్ కాస్ట్ కాగా 19,80,000 లక్షలు సబ్సిడీ మరియు 3,30,000 బెనిఫిషర్ కంట్రిబ్యూషన్, బ్యాంకు రుణము 9,90,000 అందించడంతో యూనిట్ ఏర్పాటు చేసుకున్నామని యువతీ యువకులు తెలిపారు . నిరుద్యోగులైన గిరిజన యువతి యువకులు చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకొని ఆర్థికంగా ఎదగాలని, ఇక్కడ తయారు చేస్తున్న ఇటుకలు మార్కెటింగ్ సౌకర్యం కల్పించుకోవడానికి కాంట్రాక్టర్స్ తాపీ మేస్త్రీలతో సత్సంబంధాలు పెట్టుకొని సకాలంలో వారికి ఇటుకలు సరఫరా చేయాలని, దీనికి కావలసిన ముడి సామాన్లు సరసమైన ధరలకు కొనుగోలు చేసి మన్నికైన ఇటుకలు తయారు చేయాలని అన్నారు. అలాగే బ్యాంకు ద్వారా తీసుకున్న రుణము ప్రతినెల సకాలంలో చెల్లిస్తే మరల యూనిట్ నడవడానికి అవసరానికి బ్యాంకు అధికారులు రుణాలు అందించడానికి మక్కువ చూపుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ, యూనిట్ సభ్యులు ఉబ్బా కమలమ్మ, భద్రమ్మ, తిరుపతమ్మ, కార్తీక్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.