Saturday, July 19, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వానికి సలహాలు ఇస్తే తీసుకుంటాం

ప్రభుత్వానికి సలహాలు ఇస్తే తీసుకుంటాం

Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ అబద్ధాలు మాట్లాడితే నిలదీస్తాం

మాజీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామార్తి గోపి

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామ్మర్తి గోపి, రాష్ట్ర ఎన్ఎస్యుఈ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా రామ్మర్తి గోపి మాట్లాడుతూ గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ విచ్చలవిడిగా అవినీతి చేస్తే దానిని గమనించిన ప్రజలు టిఆర్ఎస్కు చెంప దెబ్బ కొట్టినట్టు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గురిచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగిందని, అయినా కూడా టిఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నామనుకొని అహంకారపు పనులు చేస్తున్నారని గోపి అన్నారు. గతంలో టిఆర్ఎస్ ఎన్నో హామీలను ఇచ్చి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు చెప్పి కాలం వెళ్లబుచ్చారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ప్రజాపాలన కొనసాగిస్తూ ముందుకు వెళుతున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ ఓర్వలేక రాష్ట్రంలో హరీష్ రావు, కేటీఆర్ జిల్లాలో ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని, అందులో భాగంగానే ఇటీవల వేల్పూర్ గ్రామంలో గల్ఫ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులను ఆదుకోవడం లేదు అని మాట్లాడడం జరిగిందని, కానీ వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ దేశాలలో ఇబ్బందులు పడుతున్న గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ సెల్ ను ఏర్పాటు చేసి గల్ఫ్ బాధితులకు సహాయం అందిస్తుందని కానీ ఎలాగైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపరచాలనే ఆలోచనతో ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు సహాయం అందించడం లేదని మాట్లాడడం జరిగిందని, ఆ విషయం అవాస్తవమని సాక్షాలతో మీకు నిరూపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు ఇచ్చిన సహాయ వివరాలు నీకు తెలిసేలా కనువిప్పు చేస్తామని మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి రెండు రోజుల ముందే పత్రిక ప్రకటన చేసి ఈ నెల 17వ తేదీన వేల్పూర్ గ్రామంలో గాంధీ విగ్రహం వద్ద సాక్షాలతో వచ్చి ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు చేస్తామని చెప్పడం జరిగిందని, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దాడి చేసే ఆలోచన లేదు అని కేవలం ప్రశాంత్ రెడ్డి చెప్పిన మాటలు అవాస్తవమని అది సాక్షాలతో నిరూపించే ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ తీసుకుందని, కానీ ఆ సంఘటనను ఘర్షణ వాతావరణం లోకి తీసుకు వెళ్ళింది కేవలం ప్రశాంత్ రెడ్డి అని, సాక్షాలతో వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకుంటే ఎక్కడికక్కడ వారు ఆగిపోవడం జరిగిందని, కానీ ఎలాగైనా ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాలని దురాచారాలతో ప్రశాంత్ రెడ్డి తమ్ముడు అజయ్ రెడ్డి ఒకరోజు ముందుగానే 40 మంది టిఆర్ఎస్ గుండాలను వారి ఇంట్లో ఉంచుకోవడం జరిగిందని ప్రశాంత్ రెడ్డికి గల్ఫ్ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సహాయ వివరాలు ఇవ్వడానికి వెళ్లిన నంగి దేవేందర్ రెడ్డి పైన టిఆర్ఎస్ గుండాలు దారుణంగా దాడి చేశారని నిజానికి నంగి దేవేందర్ రెడ్డి వాస్తవాలను చెప్పడానికే వెళ్లాడని ఎందుకంటే అధికారం పోగానే ప్రశాంత్ రెడ్డి ఇంట్లో నిద్రపోతూ సమాజంలో తిరగటం లేదు వాస్తవాలు ఆయనకి తెలుసో లేదో అని వెళ్ళాడు కానీ ఒకవేళ దాడి చేయడానికి వెళ్లుంటే ఒక్కడు వెళ్లేవాడు కాదు అని ఒంటరిగా వచ్చిన నంగి దేవేందర్ రెడ్డి పైన టిఆర్ఎస్ గుండాలు తీవ్రంగా దాడి చేయడం ఖండిస్తున్నామని రామ్మర్తి గోపి అన్నారు. ప్రశాంత్ రెడ్డికి ఆయన మాట్లాడిన మాటలపైన చిత్తశుద్ధి ఉంటే ఆయన మాట్లాడింది నిజమని ఆయన భావిస్తే ఎందుకు గాంధీ విగ్రహం దగ్గరికి రాలేదో చెప్పాలని కేవలం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సానుభూతి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తుంది అని అవాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే గాంధీ విగ్రహం దగ్గరికి రమ్మని చెప్పిందని రామ్మర్తి గోపి వివరించారు.గతంలో తెరాస నాయకులు చేసినట్టు అక్రమ కేసులు పెట్టించడం,ప్రతిపక్ష నాయకులకు వేధించడం చేస్తే ఒక్క తెరాస నాయకుడు కూడా రోడ్డుపై తిరగడానికి ధైర్యం చెయ్యదు అని,మేము ప్రజాస్వామ్య బద్దంగా పాలన సాగిస్తున్నాం కాబట్టే తెరాస నాయకులు దైర్యాంగ తిరుగుతున్నారని అన్నారు. గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటాము కానీ ప్రభుత్వం పై తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. అదేవిధంగా బాజీరెడ్డి గోవర్ధన్ ఏదో మాట్లాడాలి అని మాత్రమే మాట్లాడారని ఆయనకు పూర్తిగా విషయాలపైన అవగాహన లేదు అని ప్రశాంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అవాస్తవమని ఆయన కూడా తెలుసు కానీ ఏదో మాట్లాడాలి అని మాట్లాడడం జరిగిందని ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులుగా మీరు ప్రభుత్వానికి సూచనలు చేయాలి తప్ప తప్పుడు మాటలు మాట్లాడి అవాస్తవాలను బయటకు తీసుకురావద్దని హితవు పలికారు. మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు మాట్లాడు మాట్లాడితే గ్రామ గ్రామాన తరిమి కొడతామని రామార్తి గోపి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్,నగర మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, డిసిసి డెలిగేట్ ప్రమోద్,శోభన్, జిల్లెల రమేష్,అవిన్ ,బోటి వినోద్ కుమార్, నరేంద్ర సింగ్, సుంకేట విశాల్ మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments