పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 17 నార్పల మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలల పాఠశాల గ్రౌండ్ లో బుధవారం నిర్వహించిన డ్రిప్ మరియు స్ప్రింకర్ల పరికరాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పులసల నూతల గ్రామానికి చెందిన గ్రామ సభ్యులు విద్యుత్తుకు సంబంధించిన సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం, ఎమ్మెల్యే వెంటనే ఏమాత్రం సంబంధంలేని మేజర్ పంచాయతీ కార్యదర్శి, ఈ ఓ ఆర్ డి అధికారులను పిలిచి వారిపైన ఆగ్రహం వ్యక్తం చేసారు. వాస్తవానికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన సమస్య విద్యుత్తు శాఖ వారికి సంబంధించినది. కానీ ఏమాత్రం సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్ వారి మీద ఆగ్రహం చేయడం గమనార్హం. ఒకానొక దశలో ఎమ్మెల్యే సంయమనం కోల్పోయి సీనియర్ పాత్రికేయుని మీద రుసరుసలాడటం విశేషం. ప్రజా ప్రతినిధి సమస్యకు సంబంధం లేనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పైన ఆగ్రహం వ్యక్తం చేయడంపై, పాత్రికేయుని మీద రుసరుసలాడటంపై మండల ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు.