సత్యవేడుఎమ్మెల్యే *కోనేటి ఆదిమూలం పిలుపు
అట్టహాసంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కమిటీ ప్రమాణ స్వీకారం
పయనించే సూర్యుడు న్యూస్( ఫిబ్రవరి.7/02/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్త్వే డు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు.శుక్రవారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన కమిటీ ప్రమాణస్వీకారం మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు.
నూతన కమిటీ ఎప్పటికప్పుడు ఆసుపత్రి పరిస్థితిని సమీక్షిస్తూ అభివృద్ధి పథంలో నడిపించాలని ఎమ్మెల్యే సూచించారు.ఆసుపత్రిలో ఏదైనా సమస్య ఉత్పన్నమైతే తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే ఉన్నతాధికారుల తో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యుల చేత అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు.ఈ కార్యక్రమం అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణులను, బాలింతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.