ఎమ్మెల్యే కోరం. తక్షణమే సమస్యను పరిష్కరించాలని.వినతి
ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనం ఏర్పాటు చేయాలి
జూనియర్ కాలేజీ విద్యార్థులకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి
పయనించే సూర్యుడు జులై14 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి :భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బయ్య అభిమన్యు మాట్లాడుతూ.జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కళాశాలలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సరైన ప్రయోగశాలలు లేకపోవడంతో వారు ప్రయోగాలు చేయడంలో వెనుకంజలో ఉన్నారని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల గడుస్తున్నప్పటికీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని వారు ఖండించారు. కనీసం విద్యార్థులకు తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉందని విద్యార్థులు బయట నుంచి వాటర్ కొనుక్కొని వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కళాశాలలలో క్లాస్ రూమ్ లో ఫాన్స్, మరుగుదొడ్లు, ప్రహరీగోడలు సరిగ్గా లేక విద్యార్థుల నానా అవస్థలు పడుతున్నారు. వర్షాకాల నేపథ్యంలో కళాశాలల భవనములు శిథిలావస్థలో ఉండుట కారణంగా గోడలు తడిచి విద్యార్థులు కరెంట్ షాక్కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని వాటి స్థానంలో అదనపు గదులు అదన భవనాలు నిర్మించాలని వారు అధికారులను డిమాండ్ చేశారు. ఇన్ని సమస్యల వలయంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉండట కారణంగా విద్యార్థులు వీటిలో చేరడానికి ఎక్కువగా మొగ్గుచూపడం లేదని , సమస్యలను పరిష్కరించని పక్షాన ఎస్.ఎఫ్.ఐ.ఆధ్వర్యంలో దశల వారి పోరాటాలను నిర్వహిస్తామని జిల్లా అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య చొరవ తీసుకొని జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షాన విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కిషోర్ కళాశాల విద్యార్థులు సుమంత్ ప్రవీణ్ సురేష్ లక్ష్మణ్ మహేశ్వరి సుశీల తదితరులు పాల్గొన్నారు