స్థానిక అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా బదిలీలు
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి 7
ఈ రోజు చింతూరు డివిజన్ మండల కేంద్రంలో ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చింతూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో చింతూరు డివిజన్ డిప్యూటీ డి.యం & హెచ్. ఓ, డాక్టర్ పి పుల్లయ్య గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించడం జరిగింది వినతి పత్రాన్ని అందించిన అనంతరం సమస్యలను ఉద్దేశించి ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు మాట్లాడుతూ గత నెల 30/06/2025 నా ఏ.యన్.యం బదిలీలలో అధికారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేశారని ర్యాంక్ వారిగా చేస్తున్నామని చెప్పి వారికి నచ్చినట్లు చేశారని అన్నారు, విడో లకు ప్రయారిటీ ఇవ్వాల్సి ఉండగా వారికి అలాంటి ప్రయారిటీ ఇవ్వకుండా వారికి నచ్చినట్లు చేశారని, స్థానిక మండలలో ఇవ్వకూడదు అని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయకుండా బదిలీలు చేశారని అన్నారు ఫోన్ కాల్స్ కూడా కొంతమందికి మాత్రమే చేశారు అని అన్నారు
కనీసం చింతూరు డివిజన్ లో ఉన్న డిప్యూటీ డి.యం & హెచ్.ఓ కార్యాలయ సిబ్బందికి కూడా బదిలీల సమాచారం ఇవ్వకుండా బదిలీలు చేశారని మండిపడ్డారు, అధికారుల తప్పిదాల వలన చాలా మంది ఉద్యోగులు ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు వెంటనే రీ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని కోరారు ఈ పైన విషయాలపై చింతూరు డిప్యూటీ డి.యం & హెచ్ .ఓ గారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది డిప్యూటీ డీ యం హెచ్ ఓ గారు సానుకూలంగా స్పందించారు పై అధికారులకు పంపి ఉద్యోగులకు న్యాయం చేసేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డివిజన్ వైస్ ప్రెసిడెంట్ బొడ్డు శశికళ, కట్టం జయ, వి చిన లక్ష్మీ, పి. నాగమణి, యు అమల, పి పద్మ, జి రంగమ్మ. కె హరిని కుమారి, కె సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు