పయనించే సూర్యుడు మే 27. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు అన్నారు.మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో నమోదు పెంపుతుదల కోసం టీఎస్ యుటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజా జాత రెండవ రోజు ఏన్కూరు మండలం చేరుకుంది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారన్నారు.విద్యార్థి మెయిన్ రోడ్డు విశాలమైన తరగతి గదులు ఉంటాయని పేర్కొన్నారు తల్లితండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, రాగి జావా, ఇంగ్లీష్ మీడియం అందించడం జరుగుతుందని అన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా తల్లిదండ్రులు ఆలోచించాలని కోరారు.ఏన్కూరు మండలంలోని తిమ్మారావుపేట, బురద రాఘవా పురం జన్నారం ఏన్కూర్ మెయిన్ సెంటర్లో ఎన్రోల్మెంట్ ప్రచార జాత నిర్వహించడం జరిగిందని తెలియజేశారు.ఎన్రోల్మెంట్ ప్రచార జాత కార్యక్రమంలో టీఎస్ యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి పి.సురేష్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.రామ్ చంద్, ఎం.పుల్లయ్య, కామేపల్లి మండల అధ్యక్షులు నల్లమోతు శ్రీనివాసరావు, యుటిఎఫ్ నాయకులు ఏ.వెంకట నరసయ్య, బాలాజీ, ఎల్. గోపాల్, సంతులాల్, జె.పుల్లయ్య,ఎం. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.