సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ నాయక్
పయనించే సూర్యుడు జులై 13 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ప్రైవేట్ స్కూల్ల బుక్స్ మోతతో తల్లిదండ్రుల జేబులకు చిల్లు
విద్యా వ్యవస్థలో మార్పు అవసరం అంటున్న తల్లిదండ్రులు
మండల విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడం లేదు
మరి జిల్లా విద్యాశాఖ అధికారి అయిన పట్టించుకుంటారా లేదా అంటున్న పిల్లల తల్లిదండ్రులు
ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తున్న విద్యాశాఖ అధికారులు
పిల్లలకు చదువులు చెప్పడం ఏమో కానీ ఉపాధ్యాయులు సెల్ ఫోన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విశ్వసనీయమైన సమాచారం
మనం చదువుకోవడం మానేసి.. చదువును కొన్నడం మొదలుపెట్టి చాల ఏళ్లైపోయింది. ఆ తరువాత నుంచీ ఆ చదువుకున్న పదును తగ్గిందా లేక పెరిగిందా అన్న లెక్కలు తీయడం మాత్రం మర్చిపోయాం. చిన్న పిల్లల చదువులకు అసలైన చిరునామా మారిపోయి ఏళ్ళు గడిచిపోయినా.. అప్పటి చదువులకు ఇప్పటి చదువులకు మధ్య ఆ గీత మాత్రం చెరిగిపోనేలేదు. మెరిసిపోతున్న ఈ గిల్టునగల్నే చూసుకుని మురిసిపోతున్నాం తప్ప. బంగారానికున్న అసలు విలువను మాత్రం ఎప్పుడో ఎప్పుడో మరచిపోయ్యాం.. ప్రభుత్వ పాఠశాలలు అంటేనే మనకు ఎందుకో తెలియదు అదోరకం యావగింపు. అవి మనకు సంభదించినవి కానేకావన్న ఒకలాంటి దురభిప్రాయం. ఇవాల్టి సగటు తల్లిదండ్రుల్ని పూర్తిగా ఆక్రమించేసింది. ఇటువంటి అంటరానితనం నుంచి బయటపడేమార్గం మన వీధి బడులకు ఇంకలేనట్లేనా. ప్రైవేట్ స్కూళ్లలో 25% సీట్లు పేదింటి బిడ్డలకు కేటాయించాలంటూ విద్యహక్కు పేరుతో ఒక చట్టాన్నే వ్రాసుకున్నాము. కానీ ఇలా ప్రైవేట్ స్కూళ్ల వెంటపడటం మానేసి, గోవర్నమెంట్ స్కూలనే ఆ ప్రైవేట్ స్కూళ్లను తలదన్నేస్థాయికి చేర్చుకుందామన్న కనీసం ఇంగితాన్ని ఏ ప్రభుత్వం దగ్గర ఎందుకు చూడలేకపోతున్నామన్నదే మన తల్లిదడ్రుల మరియు మన ప్రజల ప్రశ్న.అసలు ఈ కొన్నుకున్నే చదువులు పుట్టక ముందే వీధి బడి నుంచి నేరుగా ఉన్నత శిఖరాలను ఎక్కిన వ్యక్తిత్వాలు ఎన్నిలేవూ. ఆ పచ్చడి అన్నంతోనే పచ్చటి భవ్యష్యతును సొంతము చేసుకొన్నా గొప్పవాళ్లు మన మధ్యలోనే ఎంత మంది లేరు. మన ఊరి ప్రెసిడెంట్, మన ఊరి ప్రధానోపాధ్యాయుడు, చివరకు దేశ ప్రధానమంత్రి దాకా ఇవాళ మనల్ని ఆలిస్తున్న, పాలిస్తున్న పెద్దొలందరికి అసలు ఈ కాన్వెంట్ స్కూల్ ల ఊసే తెలియదు. ఇంగ్లీష్ మీడియం తరగతులకైతే బోడ్డు తెగిందేలేదు. ఇప్పుడు మాత్రమే ఖరీదైన చదువులంటూ ఎందుకు ఈ వేలంవెర్రి. నాలుగయిదు లాకారాల్ని సమర్పించుకుంటేతప్ప అడ్మిషన్ దొరకని కార్పొరేట్ స్కూల్ కొన్ని అయితే, కాన్సెప్ట్ స్కూల్స్ అంటూ సూపర్ మార్కెట్ స్థాయిలో చెలరేగిపోతున్న కాన్వెంట్ ల అయితే పిల్లాడి ప్రీ-కేజీ సీటు కూడా వేలకువేలు ధారపోయాల్సిన పరిస్థితి. నిన్నమొన్నటిదాకా నగరాలు, మహానగరాలకు మాత్రమే సోకింది ఈ అంటురోగం. ఇవ్వాళ ఏజెన్సీ ప్రాంతాలకు మున్సిపాల్టీలు, పంచాయితులకు కూడా పాకిపోయింది ఈ అంటురోగం, ఫలానా ఫలాన వాలా అబ్బయ్యో , అమ్మయ్యో ఫలాన స్కూల్లో చదువుతున్నాడన్న గొప్పలు పోవడానికి మధ్యతరగతోడే ఇల్లు గుల్లచేసుకుంటున్న పరిష్టితి. కాకపోతే అక్కడ కాసులు గుమ్మరించి స్కూల్ బాగ్ సంచులనిండా బుక్స్ ధట్టించి స్కూలుకు తోసెయ్యడం తప్పిస్తే , మన పిల్లలు చదువుతున్న స్కూల్లల్లో ఎటువంటి విలువలున్నాయ్.. ఎటువంటి బోధనా ప్రమాణాలున్నాయ్..అక్కడ టీచర్లకున్నా క్వాలిటీలేంటి.. క్వాలిఫికేషన్లేటి.. ఇటువంటి వివరాలకోసం ఎవరు ఎప్పుడు ఆరా తీసిందిలేదు. ఓ 15, 20 సంవత్సరాల క్రిందట అయితే దగ్గర్లోన్న మండల విద్యాశాఖ అధికారులు స్కూల్ కి వచ్చి స్కూల్ లో హాజరు, సిలబస్ ఎంత జరిగింది, టీచర్స్ క్వాలిటీలేంటి, క్వాలిఫికేషన్లేటి అన్ని పారశీలించేవారు, కానీ ఇప్పుడు అయితే ఇదంతా జరగడంలేదు. ఇవ్వాల ఏటా కోట్లు కూడపెట్టుకుంటున్న ఈ కాన్వెంట్ స్కూల్లలో పిల్లలు ఆదుకోవడానికి అరెకరం ప్లేగ్రౌండ్ కూడా ఉండదు. నాలుగు పుస్తకాలుపెట్టి చదివించాల్సిన లైబ్రరీ ఉండదు, చివరకి చిన్నపాటి లెబోరీటరి కూడ కనిపించని ప్రైవేట్ స్కూల్ లు 80% కి పైమాటే. మంచి బడి అంటే ఓనాలుగు అంతస్థుల మేడ మాత్రమే. ఇది వాళ్ళ బాడీ లాంగ్వేజ్. ఇంతటి పగటి మోసాన్ని , ఈ నిలువు దోపిడీని ఎండగట్టాలన్న కనీస ప్రయత్నానికి మన ప్రభుత్వోలు ఎందుకు ఒడికట్టరు. కనీస హాజరు లేక మూతపడిపోతున్న తమ సర్కారీ బడులను చూసి భోరున ఏడవడం తప్పిస్తే మన విద్యా శాఖధికారుల దగ్గర ఒక ఎత్తుడగంటూ ఎందుకు లేకుండాపోయింది. ఆలోచన, చిత్తశుద్ధి ప్లస్ అంగుళమంత అంకితభావం ఇవ్వన్నీ కలిస్తే ఒక విజయాన్నికి పుట్టుక. పైగా వస్తువు తయారికంటే.. దాన్నీ అమ్ముకునె మార్కెటింగ్ ఫార్ములానే ఇవ్వాల్టి రోజులో కీలకం. కానీ కొన్నిచోట్ల ఎవ్వరొకరు ఎప్పుడోకప్పుడు అంటూ ఇకరిద్దరూ మాస్టారులు వేసిన గవర్నమెంట్ స్కూళ్ల ప్రచారాన్ని ఇటువంటి ఒక మంచి ముందుడగును ప్రస్తవిచాలన్నది సమాచార హక్కు చట్టం 2005 యాక్టి విస్ట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ నాయక్ అభిమతం, దీనికే ఇంతటి పొడవలాంటి ఉపోద్గతం. కానీ దీనికంటే విషమమైన అంశం — ‘‘బుక్స్ మోత’’. ఒక చిన్న గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో రోజూ ఉదయం 8 గంటలకే విద్యార్థులు జాబిలి లాంటి నిదురతో లేచి, భారం తీరని స్కూల్ బ్యాగ్ తీసుకొని పాఠశాలకు బయలుదేరతారు. ప్రతి ఒక్కరి భుజానూ ఒక్కటి కాదు రెండు కాదు – పది పుస్తకాలు, నాలుగు నోటుబుక్స్, మూడు వర్క్‌బుక్స్, కలం పెట్టె, టిఫిన్ డబ్బా, వాటర్ బాటిల్… ఇంకా ఎన్నెన్నో! ఒక రోజు క్లాస్-3లో చదువుతున్న అన్విత తల్లి అడిగింది: “అమ్మాయీ! ఇన్ని పుస్తకాలు ఎందుకు అమ్మా? అన్విత చిన్న గొంతులో “మిస్ డైలీ అన్ని బుక్స్ తీసుకురమ్మంటారు.. బుక్స్ తీసుకురాలేదంటే స్కూల్లో నిలబెట్టి సారం చెబుతారు” అని చెప్పింది. ఈ మాట విని తల్లి హత్తుకొని ఏడ్వక తప్పలేదు. ఇది ఒక్క అన్విత కథ మాత్రమే కాదు. అమ్మమ, నాన్నమ్మ లదగ్గర కూర్చొని కథలు చేపించుకోవాల్సిన వయుస్సులో చదువులు అంటూ పాఠశాలలో పెట్టె ఇబ్బందులకు తీవ్రంగా దేశవ్యాప్తంగా లక్షలాది ప్రైమరీ విద్యార్థుల రోజువారీ బాధ. చిన్న వయస్సులోనే ఒత్తిడి, భారం, చదువంటే భయం… ఇలా జ్ఞానార్జన ప్రయాణం భయానకంగా మారిపోతుంది. నిజానికి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ ఈ పి) ప్రకారం ప్రాథమిక విద్యలో ఆటలతో పాటు నేర్చుకునే అభ్యాసాన్ని ప్రోత్సహించాలనిది. కానీ జర్మనీలో ఒక పాఠశాలలో ఒకే ఒక నోట్‌బుక్‌తో పిల్లలు స్కూల్‌కి వస్తారంటే మన దేశంలో మాత్రం 4 నుంచి 7 కేజీల బ్యాగ్‌తో బుక్స్ మోత తప్పనిసరిగా మారింది. అంటే రాబోయే కాలమములో చదివిన కూడా ఉద్యోగాలు రాకపోయినా కనీసము మూటలు మోసియైన బ్రతకవచ్చని ఇప్పుడే విద్యార్థులకు భోధిస్తునట్లుంది ఈ పాఠశాలలో. ఇది ఇలాఉండగా పాఠశాల నుంచి వచ్చినవెంటనే హోంవర్క్స్ , పరీక్షలు అంటూ ఎప్పుడు బుక్స్ దగ్గరనే కూర్చోవడము, అంతేకాకుండా ఒక్కొక్కసారి పాఠశాలలో ఇచ్చిన తల్లితండ్రులే హోంవర్క్ చేయవల్సిన పనివస్తుంది. అంతేకాకుండా ఇంత చిన్న వయసులోనే తల్లిదండ్రులు ప్రేమను కోల్పోతున్నారు. ఈ బుక్స్ మోత విద్యార్థుల మానసిక ఎదుగుదల లేకపోవడం, త్వరగా గూని రావడము, అతి పిన్న వయసు లోనే కంటి చూపు తగ్గి, కంటి అద్దాలు రావడం జరుగుతుందిని పిల్లల తల్లిదండ్రులు మరియు వైద్యాధికారులు విచారంవ్యక్తచేస్తునారు విద్య అనేది ప్రతి ఒక్కరికి మౌలిక హక్కు. కానీ ఆ హక్కు ఈ రోజుల్లో ఖరీదైన స్వప్నంగా మారుతోంది. ప్రైవేట్ హైస్కూల్స్ లో విద్యార్థులకు వసూలు చేసే ఫీజులు, పుస్తకాల ధరలు సామాన్య తల్లిదండ్రులకు తీవ్ర ఆర్థిక భారం గా మారాయి. ఇటీవల ప్రారంభమైన 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ పాఠశాలలు అడిగే అడ్మిషన్ ఫీజు, వార్షిక ఫీజు, ల్యాబ్, ట్రాన్స్పోర్ట్, యూనిఫామ్, మరియు పుస్తక ఖర్చులు కలిపి కనీసం రూ. 40,000 నుండి రూ. 1,00,000 వరకు వసూలు చేస్తున్నట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు. ముఖ్యంగా పుస్తకాలపై ఉండే ఒత్తిడి మరీ విపరీతంగా ఉంది. పాఠశాలలే ముందుగానే ఖచ్చితమైన పబ్లిషర్ పుస్తకాల జాబితా ఇచ్చి, బయట దొరకని పరిస్థితిలో స్కూల్ ల వద్దే కొనాల్సిన పరిస్థితి తలెత్తిస్తోంది. దేశభవష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది అంటూ విద్యావేత్త కొఠారి అనే పండితుడు చెప్పిన అక్షరసత్యం. కాకపోతే అది ప్రైవేట్ తరగతి గదులోనో, లేక ప్రభుత్వ తరగతి గదులోనో అన్నదే ఇవ్వాలా తేల్చుకోవల్సిన పరిస్థితి. సుమారు 2 కోట్ల 30 లక్షమంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చేరిపోయి అమ్మానాన్నల జేబులకు చిల్లుపెట్టేస్తుంటే, సర్కారీ వారి బడుల్లో చదువుకుంటున్న వాలా సంఖ్య దాదాపు కోటి మంది దగ్గర మాత్రమే ఆగిపోయింది. రేపటి రోజున అదికాస్తా అరిగికరిగి అరకోటికి దగ్గరైన అక్కడ ఆశ్చర్యాలుండవు అందుకే చెదిరిపోతున్న ఈ ఓనమాలును సరిదిద్దుకోవడానికి ఇటువంటి సాలోచనాపరులు అయినా బడి పంతులే నడుము కట్టాల్సింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ప్రైవేట్ పాఠశాలలు విద్యను ఓ సేవా కార్యక్రమంగా కాకుండా, పూర్తిగా లాభాపేక్షతో నడుస్తున్న వ్యాపార రంగంగా మలచడం చాలా బాధాకరం. విద్యార్థుల హక్కులను గౌరవించకుండా, వారి భవిష్యత్తును పక్కనబెట్టి అధిక ఫీజులు, తప్పనిసరి బుక్ కొనుగోళ్ల పేరుతో తల్లిదండ్రులను ఆర్థికంగా శోషిస్తున్న తీరుపై మేము తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. ఇలాంటి అన్యాయ పరిస్థితుల్లో విద్యార్థులకు న్యాయం జరగాలంటే, ప్రభుత్వమే తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మేము ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఏమనగా : విద్యను వ్యాపారంగా మలుచుకుంటున్న ప్రైవేట్ స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఫీజుల నియంత్రణ కోసం ఖచ్చితమైన చట్టాలను అమలు చేయాలి, పిల్లల భవిష్యత్తు హానికరంగా మారక ముందే ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సంబంధిత విద్యా శాఖ అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు చేపట్టాలి. అని సమాచార హక్కు చట్టం 2005 ఆక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
గుగులోత్ భావుసింగ్ నాయక్ డిమాండ్