పయనించే సూర్యుడు// న్యూస్ ఏప్రిల్ 24//మక్తల్ రిపోర్టర్ సీ తిమ్మప్ప//
23/4/2025 రోజు మక్తల్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 2024-25 విద్య సంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 1 నుండి 4 వ తరగతి విద్యార్థులు శాన్విక, క్షేత్ర, అభిలాష్,అపర్ణ,స్పందన,లావణ్య,గోపిక,వెన్నెల కు గోల్డ్, సిల్వర్ మెడల్స్ తో ప్రతిభా పురస్కారాలు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అంద చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ఇలాంటి కార్యక్రమాలను ప్రత్యేకంగా ఈ సంవత్సరం నుండి ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నామని తెలిపారు అదేవిధంగా గ్రామ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే పూర్తి స్థాయి ఇంగ్లీష్ మీడియం ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు .ఈ వేసవి కాలంలో విద్యార్థులు బావుల దగ్గర,వడ దెబ్బ, ఈదురుగాలి వీచినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు.అనంతరం ప్రగతి నమోదు పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం శ్రీకాంత్ ,ఇందిరా లు పాల్గొన్నారు