
రుద్రూర్, నవంబర్ 1 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): బోధన్ శాసనసభ్యు
, రాష్ట్ర సీనియర్ నాయకుడు పి.సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారులుగా ప్రభుత్వం నియామకం చేయడం పట్ల రుద్రూర్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని పి.సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసిన వారిలో కాంగ్రెస్ నాయకులు తాహెర్ బీన్ అందాన్, షేక్ నిస్సార్, పార్వతి ప్రవీణ్, గౌస్, గాండ్ల సాయిలు తదితరులు ఉన్నారు.