రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వెల్లడి
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ ఆఫీసులో ఈ రోజు నిర్వహించిన భూభారతి పై అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా గ్రేడ్- వన్ శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ నక్క బాల్ రాజ్ యాదవ్ కలెక్టర్ తో మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలోని,నియోజకవర్గ పరిధిలో గల ప్రభుత్వ, భూదాన్,అసైన్డ్ ఎండోమెంట్ భూములకు మేము రిజిస్ట్రేషన్ చేపించి మీకు పట్టా పుస్తకాలు ఇప్పించే బాధ్యత మాది అని కొంతమంది దళారులు అడుగుతున్న సందర్భాన్ని నక్క బాల్ రాజ్ యాదవ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది.వారు ఈ విషయాన్ని విని, భూభారతి- కీలక అంశాలు లో భాగంగా మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్ వక్ఫ్ భూములకు పట్టాలు పొందుతే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి కలదు. కాబట్టి ఇట్టి భూములను ఎవరు కూడా కొనటం కానీ అమ్మడం గాని చట్టరీత్యా నేరమని,ఇట్టి మోసాలకు పాల్పడుతున్న దళారులను నమ్మకూడదని, ఇట్టి భూములకు సంబంధించి ఏవైనా సవరణ ఉంటే ఆర్డిఓ గానీ కలెక్టర్ ను గాని సంప్రదించి నేరుగా మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోగలరని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.