పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఆల్విన్ కాలనీ డివిజన్ లొ సర్వే నెంబర్ 57,336 గల ప్రభుత్వ భూములు కబ్జా చెసి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని అలాగే డివిజన్ లో నెలకొన్న పలు ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డివిజన్ అద్యక్షులు ఎత్తరి రమేష్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్ రావ్ తో కలిసి బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ ప్రజావాణి లో జి హెచ్ ఎం సి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ ని కలసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు వ్యక్తుల దౌర్జన్యాలు, ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి అన్నారు. రాత్రికి రాత్రే ఇండ్లను కూలుస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని మండి పడ్డారు. ప్రవేట్ వ్యక్తులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి ప్రభుత్వ భూములను కాపాడాలన్నారు. అలాగే అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు వేసి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల పైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఏళ్ల తరబడి పెండింగ్ లొ ఉన్న ఎల్లమ్మబండ హిందు స్మశాన వాటిక సమస్యను పరిష్కరించి ప్రజలకు త్వరతగతిన అందుబాటులో తేవాలని అన్నారు. డివిజన్ లొ డ్రైనేజ్ మరియు మంచినీటి సమస్యలను కూడా పరిష్కరించాలని కమిషనర్ ని కోరామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కమలాకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు