ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 15, ఆదోని టౌన్ నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కర్నూల్ జిల్లా 15 తేదీన ఆదోని పట్టణంలో జరిగిన 48వ జిల్లా మహాసభలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ…గత ప్రభుత్వం తీసుకొచ్చిటివంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను పులివెందుల నిర్మించారు. కాగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కళాశాలను నడుపులేము, సదుపాయాలు కల్పించలేమంటూ ఎన్.ఎం.సీ వారికి లేక రాయడం దుర్మార్గమైన ఆలోచన అని వారన్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న విద్యా దీవెన వసతి దీవెన వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, సొంత భవనాలు నిర్మించాలని అన్నారు. జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలి. రాష్ట్రవ్యాప్తంగా నారాయణ విద్యాసంస్థల అధిక ఫీజుల దోపిడీ పట్ల జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ, రాష్ట్ర విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకోకుండా కార్పొరేట్ వ్యవస్థకు తొత్తుల వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఎన్నికల ముందు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికెడతామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ అధికారం 8 నెలలు అవుతున్న వారి పైన చర్యలు తీసుకోకపోవడం వెనకాల అంతరాయం ఏంటో తెలియాలి. గత ఐదు రోజుల క్రితం అనంతపురం నారాయణ కళాశాలలో అధిక ఫీజుల ఒత్తిడితో చరణ్ అనే విద్యార్థి మూడవ అంతస్తు నుంచి దూకి మరణించడం జరిగింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు, డిప్యూటీ సీఎం ఎలాంటి చర్యలు కానీ, కమిటీ కానీ వెయ్యలేదు. ఇప్పటికైనా కూడా విద్యారంగ సమస్యను పరిష్కరించి చనిపోయిన విద్యార్థికి నష్టపరిహారం చెల్లించి, చావుకు కారకులైన యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు. ఈ సందర్భంగా ఈ మహాసభల్లో విద్యారంగ సమస్యలు పరిరక్షించుకునేందుకు పోరాటానికి సిద్ధం కావాలని వారన్నారు అదేవిధంగా ఆదోని పట్టణంలో మెడికల్ కళాశాల పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు , రంగప్ప అబ్దుల్లా . జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, రవి, సాయి ఉదయ్, జిల్లా సహాయ కార్యదర్శి విజయ్, నేషనల్ విద్యా సమస్యల అధినేత గోపాల్ రెడ్డి , ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర సహకారసి నరసింహ , మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రాధాకృష్ణ, మాజీ డివైఎఫ్ఐ నాయకులు లక్ష్మన్నతదితరులు పాల్గొన్నారు.