
పయనించే సూర్యుడు సూర్యుడు మార్చి 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ప్రముఖ చిత్రకారుడు , కాట్రేనికోనకు చెందిన ఆకొండి అంజి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది సందర్భంగా నిర్వహించే అత్యున్నత పురస్కారం “ఉగాది “ పురస్కారానికి ఎంపికయ్యారు.గత మూడు దశాబ్దాలుకు చిత్రకళా రంగానికి అంకితమై ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో మాస్ట్రర్ స్ట్రోక్ పేరుతో తన సొంత నిధులతో ఆర్ట్ ఎగ్జిబిషన్ లు నిర్వహిస్తున్నారు . విభిన్న రంగాల్లో రాణిస్తున్న అంజి ఏపీ ప్రభుత్వ ఉగాది పురస్కారానికి ఎంపికకావడంపై బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, అడపా దుర్గ బాబు ఆ కొం డి మహేష్ మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు.ప్రముఖ అంజి ఆకొండి రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఎంతో మంది ప్రముఖుల పక్కన తనకు స్థానం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని, ప్రోత్సహించిన అందరికీ ఈ పురస్కారానికి తనను ఎంపిక చేసిన ప్రభుత్వానికి, సహకరించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు , ఏపీ సృజనాత్మక సాంస్కృతిక చైర్ పర్సన్ పి . తేజస్వీని కి కృతజ్ఞతలు అందరికీ తెలిపారు.