ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
ఎస్విఆర్ స్టడీ హల్ ప్రారంభోత్సవం
ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు అక్టోబర్ 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడానికి,ఒత్తిడి తగ్గించుకోవడానికి,తమ అధ్యయనాలను మెరుగుపరుచుకోవడానికి స్టడీ హాల్ ని ఉపయోగించుకోవాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో రవీందర్ రెడ్డి నూతనంగా ఏర్పాటుచేసిన ఎస్విఆర్ స్టడీ హాల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్టిసి కాలనీ మాజీ కౌన్సిలర్ బీఎస్ సుధీర్,మాజీ కౌన్సిలర్లు రేటికల్ నంధీశ్వర్,ఈశ్వర్ రాజు,వెంకట్రాంరెడ్డి,కానుగు అనంతయ్య,బచ్చలి నరసింహ,మానస యాదగిరి నాయకులు సుమదిర్ బబ్లు,బంక్ శ్రీనివాస్ రెడ్డి,నిజాం,నరేష్, మల్లేష్,సంతోష్ యాదవ్,రఘు,అజ్జు, సుధీర్ తదితరులు పాల్గొన్నారు