ప్రశాంత్ ని మెచ్చుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని, శాద్నగర్ నియోజకవర్గంలో పూలే విగ్రహాల వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూలమాల వేసి, పూలే గారి సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ప్రశాంత్ ముదిరాజ్ నడిపిస్తున్న సామాజిక న్యాయ పోరాటాన్ని విశేషంగా ప్రశంసించారు. “ప్రశాంత్ లాంటి యువ నాయకులు చట్టసభల్లోకి రావాలి. సామాజిక మార్పుకు ఇదే మార్గం. ఆయనకు నా మనస్ఫూర్తి అభినందనలు, ఆశీస్సులు” అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.ప్రజాస్వామ్యంలో బీసీ వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ప్రశాంత్ ముదిరాజ్ కి ఈ విధంగా ప్రజాప్రతినిధి నుంచి వచ్చిన ప్రశంసలు మరింత ఉత్తేజాన్ని కలిగించాయి