

పయనించే సూర్యుడుD.6.8.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్.ఎరుగట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్ఆనాడు కమిషన్ల కోసమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు. పేదలకు ఇండ్లు పంచాలి అన్న ఆసక్తి ఆనాటి ప్రభుత్వానికి లేదు. ప్రశాంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయలేకపోయారుఈ రోజు గురువారం రోజున ఏర్గట్ల మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను మనలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం తెలంగాణ మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి కేవలం కమిషన్ల కోసమే ఇండ్ల నిర్మాణాలు చేపట్టినట్లు పేదలకు ఇండ్లు పెంచాలన్న కనీస ఆసక్తి కూడా వారికి లేనట్లు నిర్మాణాలు చేపట్టారని మండల కాంగ్రెస్ పార్టీ ఆరోపించారు.మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాంట్రాక్టర్ కు 95% బిల్లు ఇచ్చికూడా మంత్రిగా ఉండి భూమి పూజ చేసి 30 నెలల వరకు అధికారంలో ఉండి అసంపూర్తిగా వదిలి వేసి నాణ్యత లేకుండా కట్టించిన అప్పటి BRS ప్రభుత్వ అసమర్థ పాలన కమిషన్ కోసం కాంట్రాక్టర్ కు ముందుగా బిల్లులు చెల్లించి సిగ్గు లేకుండా అప్పుడే పనులు పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రజా ప్రభుత్వాన్ని నిధులు కేటాయించండి అని అడుగుతున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మరియు BRS నాయకుల వైఖరిని తప్పుబడుతున్నట్టు ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇప్పుడు ఈ ప్రజాపాలన ప్రభుత్వములో గడిచిన 30 నెలలోనే ఏర్గట్ల మండల పరిధిలో అర్హులకు సుమారు 5 వందల వరకు ఇండ్లు మంజూరు చేసి ఒక్క ఇల్లుకు 5 లక్షలు ఇస్తూ ఇప్పటికీ సగం వరకు పూర్తి చేసుకొని నివసిస్తున్నారు ఇంకా సగం ఇండ్ల పనులు కొనసాగుతున్నవని అవి త్వరలో పూర్తి చేసుకొని ఇంకా అర్హత ఉన్న మిగిలి పోయిన లబ్ధిదారులకు కూడా రేవంతన్న ప్రభుత్వం మండలంలో మరో 500కు పైగా ఇండ్లను మంజూరు చేస్తుందని, పేదలకు సహాయం చెయ్యాలంటే కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అని అన్నారు. నాణ్యత లోపించిన పనులుతో పాటు అసంపూర్తిగా వదిలివేసిన అప్పటి BRS ప్రభుత్వం డబులు బెడ్ రూమ్ ల గురించి మాట్లాడి మా ప్రజా ప్రభుత్వన్ని విమర్శ చెయ్యడం మీకు అర్హత లేదని శివకుమార్ అన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు సోమ దేవారెడ్డి , సర్పంచ్ లు , ఉపసర్పంచులు, డైరెక్టర్ , మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు