పయనించే సూర్యుడు. మార్చి 15. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
అసెంబ్లీలో మాజీ మంత్రివర్యులు జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు అప్రజాస్వామికమని, స్పష్టమైన కారణం లేకుండా జగదీశ్ రెడ్డిపై వేటు హేయమైన చర్యేనని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు సస్పెన్షన్ వేటును ఖండిస్తూ శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. జగదీశ్ రెడ్డి గొంతు నొక్కిఏదో సాధిస్థామంటే అది సర్కార్ పిచ్చి ఆలోచనే అన్నారు. తెలంగాణ సమాజం అంతా చూస్తోంది ప్రజాక్షేత్రంలో ప్రతిదానికీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని ఆయన తెలిపారు. ప్రజాపాలనలో ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.