పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 07. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్శ్రీ యం.వి. మధుసూదన్ - జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమ అధికారిఖమ్మం జిల్లాలో మామిడి సాగును 32,105 ఎకరాలలో సాగుచేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో సత్తుపల్లి, వేంసూర్, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఎర్రుపాలెం తదితర మండలాల నందు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా సాగులో ఉన్న రకాలు బంగినపల్లి , దశేరి, హిమాయత్, తోతపూరి, రసాలు తదితర రకాలను సాగు చేస్తున్నారు.ప్రస్తుత పరిస్థితులు మరియు క్రితం పరిస్థితులు దృష్ట్యా రైతులలో మరియు వినియోగదారులలో ఈ మామిడి పండ్ల వినియోగం బాగా పెరిగింది. ఎందుకనగా ఈ మామిడి పండ్లలో విలువైన పోషకాలతో పాటు ఖనిజ లవణాలు, విటమిన్లు, పీచు పదార్ధం కలదు. తద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా తో పాటు ఇతర వ్యాధులను వినియోగదారుల శరీరం తట్టుకుంటాయి.ప్రస్తుతం మామిడి పూత నుండి పిందె దశలో ఉన్నది. ఈ సమయములో ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమ అధికారి శ్రీ యం.వి. మధుసూదన్ తెలిపారు.పూత నుండి పిందె కట్టే దశలో ఉన్నటువంటి తోటలలో నీటి యాజమాన్యం చాలా కీలకం నీటిని తక్కువ మోతాదులో ఇవ్వాలి ఎక్కువ ఇచ్చినట్లయితే తామర పురుగు తేనెమంచు పురుగు బూడిద రోగం సమస్యలు పెరుగుతాయి. 2. కావున 8-15 రోజుల వ్యవధిలలో భూములను పట్టి ఇచ్చుకోవాలి.భూమిలో తేమ ఎక్కువ ఉన్నప్పుడు మామిడి తోటలో గడ్డి దోమ ఎక్కువగా ఉంటుంది దీనివలన ఎలాంటి హాని లేదు.ఈ సమయంలో ప్రధానంగా నాలుగు రకాల సమస్యలు ఉంటాయి a) నిక్కుడు పురుగు ( సెమీ లూపర్). b) తేనె మంచు పురుగు c) తామర d) బూడిద రోగం మరియు పక్షి కన్ను తెగులు.5. వీటి నివారణకు 500 లీటర్ల నీటిలో ఇమిడక్లోప్రిడ్+ ఫిప్రోనేల్ (పోలీసు etc)@100 గ్రాములు+ఏమమెక్టింన్ బెంజోయేట్ @250 గ్రాములు+మారినో@1 లీటరు+ బొరన్20@500 గ్రాములు+హెక్సకోణాజోలు@1 లీటరు. కలిపి చెట్టు అంతా తడిచే విధంగా ఒక్క పిచికారి చేసుకున్నట్లయితే అన్ని రకాల తెగుళ్లు మరియు పురుగుల బెడద తగ్గుతుంది దీనితోపాటు మంచి పిందకట్టు కూడా ఉంటుంది.పిందెలు రాలకుండా నీటి తడులు :మామిడిలో ఏర్పడిన పిందెలు రాలిపోవడం పెద్ద సమస్య. నీటి ఎద్దడి, హార్మోనులు మరియు పోషక లోపాలవల్ల ఇలా జరుగుతాయి. పిందెలు ఏర్పడే దశలో మరియు తిరిగి 15-20 రోజుల వ్యవధిలో నీటి అవకాశమున్న చోట్ల చెట్లకు 2-3 నీటి తడులివ్వడం మంచి ఫలితాలిస్తాయి. దీనివలన పిందెలు రాలడం తగ్గడమే కాకుండా కాయలు పెద్ద సైజులో నాణ్యంగా ఉంటాయి. కాయలకు మంచి ధర వస్తుంది. నీటి సౌకర్యం లేనిచోట చెట్లకు నీటిని ట్యాంకర్లతో తోలినా ఖర్చుకు మించి ఆదాయం వస్తుంది.నాణ్యమైన కాయల కోసం ఎరువుల వాడకం :మామిడిలో పిందెలు ఏర్పడి పేరిగే దశలో చెట్ల సైజును బట్టి 500-100 గ్రా. యూరియా, 500–1000 గ్రా. పోటాష్ ఎరువులను 2 కిలోలవేపపిండితో కలిపి ప్రతి చెట్టుకూ వేసుకోవడం వలన కాయలు పెదసైజులో వచ్చి నాణ్యమైన అధిక దిగుబడులు వస్తాయి.ఒక సారి చల్లిన మందులను మరోసారి చల్లకండి :చీడలనివారణలో ఉత్తమ ఫలితాలకోసం వీలైనంత వరకు ఒకసారి చల్లిన మందులను మరోసారి చల్లకూడదు. దీనవలన పురుగులు మందులను తట్టుకొనే శక్తి సంపాదించుకునే అవకాశముంది. అందుకే పైన ఒక్కో సమస్యకు ఒకటి కంటే ఎక్కువ మందులు సిఫార్సు చేయడం జరిగింది.సిఫార్సు చేసిన మందులను సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి :అధిక ఖర్చులు పెట్టి మందులను కొని పంటపై చల్లినప్పుడు అవి చల్లినప్పుడు అవి మంచి ఫలితాలు ఇవ్వాలంటే తప్పనసరిగా సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. ఉపయోగించే మందులను కూడా అధికారులు లేదా నిపుణులు సిఫార్సు మేరకు మందులను అడిగి తీసుకోవాలి. ఇందులో వ్యాపారులప్రమేయం లేకుంటే మంచిది. అధికారులు రైతులు సేవకోసమే పనిచేస్తున్నారనే విషయాన్ని రైతులు గుర్తెరిగి, అధికారులసలహాలు పొందుటకు సంకోచించకూడదు. అవసరమైతే సంబంధిత అధికారులను మరోసారి సంప్రదించి వారి సలహా మేరకు మందులను మార్చుకోవాలి.