జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుంజా
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ,మే 24…….
ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి ఆధ్వర్యంలో చింతూరు ఐటిడిఏ ముందు పదవరోజు జరుగుతున్న దీక్షలను జెఏసి రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుంజా ప్రారంభించి మాట్లాడుతూ ప్రాణాలైనా అర్పిస్తాం గాని - ఏజెన్సీ ఉద్యోగ నియమక చట్టాన్ని సాధించేవరకు ఈ పోరాటాన్ని ఆపమని, ఈ పోరాటానికి అన్ని వర్గాల ఆదివాసి ప్రజానికం పాల్గొని తమ మద్దతు ఇప్పటికే తెలియజేస్తున్నారని, రోజు రోజుకి మా ఈ పోరాటానికి ఆదరణ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని ఈ పోరాటం మరింత ఉధృతం కాకముందే ప్రభుత్వం దిగివచ్చి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని హెచ్చరించారు. చింతూరు డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ మాట్లాడుతూ ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న మా ఆదివాసులను ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దూరం చేస్తూ మా చట్టాలను జీవోలను తుంగలో తొక్కి మమ్మల్ని మళ్లీ 20 సంవత్సరాల క్రిందికి తీసుకుపోతారా అని ప్రశ్నించారు? ఈరోజు కార్యక్రమంలో కాక.సీతారామయ్య, పూసం.వేణుగోపాల్, సోడే.శ్రీను, గోరం.రాఘవ,పండా.నాగరాజు, పూసం.నాగరాజు, డుమ్మిరి.సత్తిబాబు, ఇర్ప.నాగేశ్వరావు, తొడం.సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.